Parineeti Chopra Wedding: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం అతి కొద్దిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. By BalaMurali Krishna 24 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Parineeti Chopra Wedding: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం అతి కొద్దిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. లీలా ప్యాలెస్ సరస్సు మధ్యలో కళ్యాణ మండపం ఉంది. దంపతులు పడవలో మండపానికి వెళ్లారు. పరిణీతి, రాఘవ్ పెళ్లికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, భాగ్యశ్రీ సహా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన అర్దాస్ వేడుకతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22న వధూవరుల ఉదయ్‌పూర్‌లో మెహందీ వేడుకతోపాటు సంగీత్ నిర్వహించారు. పరిణీతి చోప్రా వివాహ దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా, రాఘవ్ చద్దా దుస్తులను ఆయన స్నేహితుడు ఫ్యాషన్ డిజైనర్ పవన్ మల్హోత్రా డిజైన్ చేశారు. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు బీటౌన్ మీడియా తెలిపింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) అయితే పరిణీతి చోప్రాకు కజిన్ అయిన హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం పెళ్లికి హాజరుకాకపోవడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చెల్లి పెళ్లికి అక్క రాకపోవడానికి గల కారణాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం పరిణీతి, రాఘవ్ దంపతుకు ప్రియాంక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి ప్రియాంక హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చెల్లి పెళ్లికి రాకుండా మ్యూజిక్ నైట్‌కు వెళ్లడం ఏంటని ప్రియాంక తీరుపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. పరణీతి, రాఘవ్ చద్దా కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవారు. అయితే వృత్తి రీత్యా పరిణీతి బాలీవుడ్ కథానాయికగా రాణిస్తుండగా.. రాఘవ్ చద్దా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ఫ్రెండ్స్ కాస్త ప్రేమికులుగా మారి ఇప్పుడు వివాహ బంధంతో ఓ ఇంటి వారయ్యారు. ఇది కూడా చదవండి: చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి