AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!

విజయనగరం జిల్లా పాతరేగ గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన కనీసం పెన్షన్ రావడం లేదని ..పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు.

New Update
AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!

Vizianagaram:  పక్షవాతంతో దశాబ్ద కాలం గడుస్తున్న ఓ అభాగ్యుడు మాత్రం పెన్షన్ కి (Pension) నోచుకోవడం లేదు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని పాతరేగ గ్రామంలోని వ్యక్తి  గత 12 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.

Also Read: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.!

అతడు మంచానికే పరిమితం కావడంతో కుటుంబాన్ని కూడా పోషించలేని పరిస్థితి. అతడి భార్య కూడా పనికి వెళ్లకుండా భర్తను చూసుకుంటూ ఉండటంతో అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పలుమార్లు అధికారులకు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాధుడు లేడని..మా బాధలు ఆ దేవుడికి ఎరుక అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైన తమపై కనికరించి పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు