సెహ్వాగ్‌ను ఔట్ చేయడంపై పాక్ బౌలర్ వెటకారం.. ఇచ్చిపడేస్తున్న భారత్ అభిమానులు ప్రపంచ క్రికెట్ భీకర ఆటగాళ్లలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఎలాంటి బౌలరైనా సరే భయమనేది లేకుండా ధాటిగా ఆడుతూ బౌండర్లీ సాధిస్తాడు. ముఖ్యంగా పాకిస్థాన్ బౌలర్లను అయితే ఊచకోత కోసేవాడు. అలాంటి వీరేంద్రుడు గురించి ఓ మాజీ పాక్ బౌలర్ వెటకారపు వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది. By BalaMurali Krishna 17 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వీరేంద్రుడిపై నవీద్ వ్యాఖ్యలు వైరల్.. వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా క్రికెట్లోనే కాదు వరల్డ్ క్రికెట్లోనే మోస్ట్ డేంజరస్ ప్లేయర్. క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు వణకాల్సిందే. తొలి బంతి నుంచే బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడటంలో సెహ్వాగ్‌ను మించిన బ్యాటర్ లేనడంలో ఎలాంటి సందేహం లేదు. టీ20 క్రికెట్ లేని రోజుల్లోనే దూకుడైన ఆటతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. వన్డేల్లోనే కాదు టెస్టులోనూ ఫాస్టుగా ఆడటం వీరూ స్పెషల్. అందుకే ఇండియా జట్టు తరపున టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అలాంటి సెహ్వాగ్ గురించి పాకిస్థాన్ మాజీ బౌలర్ రాణా నవీద్ ఉల్ హసన్ వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. 2 బంతుల్లోనే 21 పరుగులు.. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీద్.. భారత మాజీ ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్‌ను ఔట్ చేయడం చాలా సులభమని చెప్పాడు. క్రీజులోకి వచ్చిన క్షణాల్లోనే పెవిలియన్‌కు పంపించవొచ్చని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఇదే భారత అభిమానులకు కోపం తెప్పించింది. పాక్ భీకర పేస్ బౌలర్ వసీం అక్రమ్ సైతం సెహ్వాగ్‌ను ఔట్ చేయడం చాలా కష్టమని చెబితే.. ఓ అనామక బౌలర్ ఇలా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా 2004లో పాక్‌తో జరిగిన సిరీస్‌లో భాగంగా నవీద్ బౌలింగ్‌లో వీరూ కేవలం 2 బంతుల్లోనే 21 పరుగులు చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్.. ఆ మ్యాచ్ 11వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన నవీద్.. తొలి బంతిని నోబాల్ వేయగా.. వీరూ ఫోర్ కొట్టాడు. అనంతరం తర్వాత బాల్ కూడా నోబాల్ వేయడం మళ్లీ బౌండరీ కొట్టడం జరిగింది. మూడో బాల్ డాట్ వేయగా.. నాలుగో బాల్ మళ్లీ నో బాల్ వేయడం.. ఫోర్ కొట్టడం జరిగిపోయింది. తర్వాత బాల్ కూడా సేమ్ రిపీట్ అయింది. మొత్తంగా ఆ ఓవర్లో 24 పరుగులు చేశాడు. సెహ్వాగ్ ఊచకోతకు గురైన నువ్వా మా వీరేంద్రుడి గురించి మాట్లాడేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మరో మూడు నెలల్లో ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరనుండడంతో పాక్ మాజీ ఆటగాళ్లు ఇలా మాటలతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు జట్ల మధ్య కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీపడుతున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి