Padma Awards 2024: పద్మ విభూషణులు వెంకయ్య, చిరంజీవి.. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. By Naren Kumar 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Padma Awards 2024: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), మెగాస్టార్ చిరంజీవికి (MegaStar Chiranjeevi) కేంద్రం పద్మ విభూషణ్ (Padma Vibhushan) ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు.. వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్ బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బిహార్ పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు విస్మృత యోధులను వరించిన పద్మశ్రీ మొత్తం 34 మంది అన్ సంగ్ హీరోస్ ను పద్మశ్రీ పురస్కారాలు (Padma Shri Awards) వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పను కూడా పద్మశ్రీ వరించింది. కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమెది కృష్ణా జిల్లా మచిలీ పట్నం. పద్మశ్రీ అవార్డులు డి. ఉమామహేశ్వరి - ఆంధ్రప్రదేశ్ గడ్డం సమ్మయ్య - తెలంగాణ దాసరి కొండప్ప - తెలంగాణ జానకీలాల్ - రాజస్థాన్ గోపీనాథ్ స్వైన్ - ఒడిశా స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర ఓంప్రకాశ్ శర్మ - మధ్యప్రదేశ్ నారాయణన్ ఈపీ - కేరళ భాగబత్ పదాన్ - ఒడిశా సనాతన్ రుద్ర పాల్ - పశ్చిమ బెంగాల్ భద్రప్పన్ ఎం - తమిళనాడు జోర్డాన్ లేప్చా - సిక్కిం మచిహన్ సాసా - మణిపుర్ శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ - బిహార్ రతన్ కహార్ - పశ్చిమ బెంగాల్ అశోక్ కుమార్ బిశ్వాస్ - బిహార్ బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ - కేరళ బాబూ రామ్‌యాదవ్ - ఉత్తర్‌ప్రదేశ్ నేపాల్ చంద్ర సూత్రధార్ - పశ్చిమ బెంగాల్ సామాజిక సేవా రంగం సోమన్న - కర్ణాటక పార్బతి బారువా - అస్సాం జగేశ్వర్ యాదవ్ - ఛత్తీస్‌గఢ్ ఛామి ముర్మూ - ఝార్ఖండ్ గుర్విందర్ సింగ్ - హరియాణా దుఖు మాఝీ - పశ్చిమ బెంగాల్ సంగ్థాన్‌కిమా - మిజోరం వైద్యరంగం హేమచంద్ మాంఝీ - ఛత్తీస్‌గఢ్ యజ్దీ మాణెక్ షా ఇటాలియా - గుజరాత్ ప్రేమ ధన్‌రాజ్ - కర్ణాటక క్రీడారంగం ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే - మహారాష్ట్ర ఇతర రంగాలు యనుంగ్ జామోహ్ లెగో - అరుణాచల్ ప్రదేశ్ సర్బేశ్వర్ బాసుమతరి - అస్సాం సత్యనారాయణ బెలేరి - కేరళ కె.చెల్లామ్మళ్ - అండమాన్ నికోబార్ Also Read: మసీదు కింద గుడి ఆనవాళ్లు.. జ్ఞానవాపి కేసులో ఏఎస్ఐ సంచలన నివేదిక! #megastar-chiranjeevi #venkaiah-naidu #padma-awards-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి