మట్టి ఇళ్లను కూల్చి వేసి అది మీ బలంగా భావిస్తున్నారా.... ఖట్టర్ సర్కార్ పై ఒవైసీ ఫైర్....! హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేత చర్యలపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిజమైన క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం పేద ముస్లింల నివాసాలపై కూల్చి వేత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు By G Ramu 06 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేత చర్యలపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిజమైన క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం పేద ముస్లింల నివాసాలపై కూల్చి వేత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. కేవలం ఆరోపణల వల్ల రాష్ట్రంలో వందలాది పేదలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. విధ్వంసం పట్ల సంఘీలు గర్వపడుతున్నప్పటికీ, మానవత్వ డిమాండ్ల ప్రకారం అది చట్టబద్ధంగా సరైనది కాదన్నారు. హర్యానాలో పేద ముస్లింలను మాత్రమే టార్గెట్ చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నిజమైన క్రిమినలస్ గన్స్ పట్టుకుని బజార్లలో స్వేచ్చ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఖట్టర్ ప్రభుత్వం ఆ కిమినల్స్ ముందు దాసోహం అంటోందన్నారు. మట్టి ఇళ్లు, మురికివాడలను కూల్చివేసి మిమ్మల్ని మీరు బలంగా భావించడం పెద్ద విషయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చి వేత చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వాలు చట్ట బద్దమైన ప్రక్రియను అనుసరించాలని సుప్రీం కోర్టు సూచించిందని గుర్తు చేశారు. బిల్డింగ్ యజమాని నుంచి వివరణ తీసుకోకుండా ఎలాంటి చర్య తీసుకోకూడదన్నారు. ఇటీవల హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో హర్యానా సర్కార్ బుల్డోజర్ చర్యలకు దిగింది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని పలు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అల్లర్లలో పాల్గొన్న వారిని టార్గెట్ చేసుకుని ఈ కట్టడాల కూల్చివేత జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా శనివారం ఉదయం నల్హార్ ప్రాంతంలోని మెడికల్ కాలేజి వద్ద ఉన్న అక్రమ కట్టడాలపైకి బుల్‌డోజర్లను పంపించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి