OTT Movies: ఓటీటీలో ఆ నలుగురు హీరోయిన్ల హవా.. ఆ సినిమాలు తెగ చూసేస్తున్నారు 

ఇటీవల కొన్ని ఆన్ లైన్ మీడియా సంస్థలు ఓటీటీ సినిమాల వ్యూయర్ షిప్ పై ఒక సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో నయనతార - కర్తవ్యం, అనుష్క-అరుంధతి, సమంత-యశోద, కీర్తి సురేష్-మహానటి సినిమాలు ఓటీటీలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలామంది చూస్తున్న సినిమాలుగా సర్వే  చెబుతోంది. 

New Update
OTT Movies: ఓటీటీలో ఆ నలుగురు హీరోయిన్ల హవా.. ఆ సినిమాలు తెగ చూసేస్తున్నారు 

OTT Movies: ఇప్పుడు సినిమా చూడటం కోసం థియేటర్లకు వెళ్లడం చాలా తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే.. కంటెంట్ ఉన్న సినిమా అయితేనే థియేటర్ల వైపు ప్రేక్షకులు చూస్తున్న పరిస్థితి ఉంది. హీరో.. హీరోయిన్లు ఎంత క్రేజ్ ఉన్నవారైనా.. ఎంత బలమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్నవారైనా.. సినిమాలో దమ్ముంది అని అనిపిస్తేనే థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు. లేకపోతె.. నాలుగు వారాలు పోతే టీవీలో ఎంచక్కా చూసేయొచ్చుగా అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అలా అని ఓటీటీలో కొత్త సినిమాలు మాత్రమే చూస్తున్నారు అని అనుకోకండి.. కంటెంట్ అదిరిపోయిన పాత సినిమాలు కూడా మళ్ళీ.. మళ్ళీ చూసేస్తున్నారు. పాత సినిమాలు.. క్లాసిక్ సినిమాలు వదలకుండా చూడటం ఎక్కువగానే ఉంది. ఈ విషయాలు ఇటీవల కొన్ని ఆన్ లైన్ మీడియా సంస్థలు చేసిన సర్వేలో వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో చాలా సినిమాలు మంచి స్పందనతో వ్యూయర్ షిప్స్ పెంచుకుంటున్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల తీరే వేరేగా ఉందని సర్వే చెబుతోంది. ఓటీటీలో ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చూడడం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

OTT Movies: ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో టాలీవుడ్ హీరోయిన్ల సినిమాలకు మంచి బజ్ ఉందట. అందులోనూ అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ నటించిన నాలుగు సినిమాలకు వ్యూయర్ షిప్ ఇంకా ఎక్కువగా ఉండటమే కాదు.. పెరుగుతూనే ఉందని సర్వేలో తేలింది. ఈ సినిమాలను దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు చూస్తున్నారట. డబ్బింగ్ వెర్షన్స్.. అలాగే తెలుగులోనే సినిమా ఉన్నప్పటికీ.. ఇంగ్లిష్, హిందీ సబ్  టైటిల్స్ ఉండడంతో భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఇక తెలుగు నుంచి అలా విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఏమిటో ఓ లుక్కేద్దాం. 

Also Read: పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్!

అరుంధతి: ఓటీటీలో ఇప్పటికీ టాప్ వ్యూయర్స్ తో దూసుకుపోతున్న సినిమా అరుంధతి. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు తెరపై సంచలనం సృష్టించి.. అనుష్కను తిరుగులేని స్టార్ గా మార్చేసింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్స్ మాయాజాలం అంతగా పరిచయం లేని ఆరోజుల్లోనే విజువల్ వండర్ గా ఈ సినిమా ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాని ఓటీటీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఉంది. 

మహానటి: అలనాటి సూపర్ స్టార్ సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మహానటి. కీర్తి సురేష్ సావిత్రి పాత్రను చేసింది. సినిమా ఎనౌన్స్ అయిన  దగ్గర నుంచి భారీ అంచనాలు తెచ్చుకున్న ఈ సినిమా విడుదల తరువాత అందరితోనూ సూపర్ అనిపించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ మౌల్డ్ అయిన విధానము చూసి ఆ మహానటి తిరిగి వచ్చిందా అని ప్రేక్షకులు ఆశ్చర్య పోయారు. ఈ సినిమా అవార్డులు.. రివార్డులు కొట్టేసి టాప్ క్లాస్ సినిమాగా నిలిచింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్టీమింగ్ అవుతూ మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ బ్రేక్ లేని వ్యూయర్ షిప్స్ తో నడుస్తోంది. 

యశోద: సమంత హీరోయిన్ గా వచ్చిన సినిమా ఇది. మహిళల సమస్యలపై తీసిన ఈ సినిమాలో సమంత నటనకు ఫుల్ మర్క్స్ పడ్డాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత బాగా సరిపోతుంది అని నిరూపించింది ఈ సినిమా. అయితే, ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ, ఓటీటీలో మాత్రం విడుదలైన తరువాత దుమ్ము దులిపేసింది. అప్పట్లో మంచి వ్యూయర్ షిప్ కొట్టేసి చాలా రోజులు చార్ట్ లో టాప్ 10 లో ఉంది. ఈ సీనిమాను ఇప్పటికీ ఓటీటీ ప్రేక్షకులు తీరిక ఉన్నప్పుడల్లా చూసేస్తున్నారు. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతోంది. 

కర్తవ్యం: నయనతార హీరోయిన్ గా వచ్చిన తమిళ సినిమా ఆరం కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కర్తవ్యం. ఈ సినిమా ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పాటు.. తెలుగు వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో తెగ చూసేస్తున్నారట. ఇప్పటికీ ఈ సినిమా ఎక్కువ మంది చూస్తున్నారని ఆన్ లైన్ సర్వే చెబుతోంది. 

ఇక ఈ సినిమాలే కాకుండా.. థియేటర్లలో చేతులెత్తిసిన సినిమాలు.. సూపర్ హిట్ అయినా సినిమాలు చాలా ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు