/rtv/media/media_files/2026/05/29/zynkhana-ground-2026-05-29-12-28-20.jpg)
-RAVI PRAKASH
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/ravi-prakash-2026-05-27-18-35-07.jpeg)
ఢిల్లీ నడిబొడ్డున 27 ఎకరాల ప్రైమ్ ల్యాండ్! కోట్లాది రూపాయల విలువైన సామ్రాజ్యం! లూటియన్స్ ఢిల్లీలో అధికారం, హోదా, రాజసం ఉట్టిపడే ఆ అడ్రస్సే... ఢిల్లీ జింఖానా క్లబ్! ఇన్నాళ్లూ బ్రిటీష్ కాలం నాటి దొరతనాన్ని, ఎలైట్ కల్చర్‌ను మోస్తూ... సామాన్యుడికి అడుగుపెట్టే ఛాన్స్ లేని ఆ కోట గోడలు ఇప్పుడు బీటలు వారబోతున్నాయి..! దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. జర్నలిస్టులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్మీ వెటరన్స్, లాయర్లు, పొలిటికల్ కామెంటేటర్ల గుసగుసల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ క్లబ్‌పై ఎందుకు ఉక్కుపాదం మోపింది? కోట్లు కుమ్మరించాల్సిన దాని రెంట్ కేవలం వందల రూపాయలేనా..? ఇది నిజంగానే కలోనియల్ ఎలైట్స్‌పై మోదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధమా? లేక, పవర్ పాలిటిక్స్ వెనుక ఉన్న కుట్రనా..? లెట్స్ బ్రేక్ డౌన్...
1913లో బ్రిటీష్ పాలకులు ఈ క్లబ్‌ను స్థాపించారు. ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్‌గా మొదలైన ఈ సామ్రాజ్యం, స్వాతంత్ర్యం వచ్చాక 'ఢిల్లీ జింఖానా క్లబ్'గా మారింది. దేశాన్ని శాసించే టాప్ బ్యూరోక్రాట్లు IAS, IPS, జడ్జీలు, మిలిటరీ జనరల్స్, రాజకీయ నాయకులు, అపర కుబేరులకు మాత్రమే ఇక్కడ మెంబర్‌షిప్ ఉంటుంది. ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్ రావడం అంత ఈజీ కాదు. అప్లై చేసుకుంటే సీటు రావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. ఇదొక క్లోజ్డ్ గ్రూప్...పాత మెంబర్ల పిల్లలకే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సామాన్యుడికి ఇక్కడ నో ఎంట్రీ!
అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఢిల్లీ జింఖానా ల్యాండ్ సాధారణ భూమి కాదు. లుటియన్స్ ఢిల్లీలో దాదాపు 27 ఎకరాల ప్రైమ్ ల్యాండ్... ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఈ క్లబ్‌ను జూన్ 5 లోపు ఖాళీ చేయాలని ఆదేశించింది. అందుకోసం పబ్లిక్ పర్పస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాలని, సెక్యూరిటీ రీజన్స్ అంటూ రకరకాల కారణాలు చెప్పింది. కానీ రెంట్ మేటర్ బయటకు వచ్చాకే అసలు బాంబ్ పేలింది. కలోనియల్ కాలం నాటి లీజ్ ఒప్పందం ప్రకారం, ఈ 27 ఎకరాల భూమికి ఢిల్లీ జింఖానా క్లబ్ చెల్లిస్తున్న యాన్యువల్ గ్రౌండ్ రెంట్.. జస్ట్ 409 రూపాయలే. మీరు విన్నది నిజమే. కోట్లరూపాయలు విలువ చేసే భూమిని, ఏళ్ల తరబడి 409 రూపాయలు చెల్లిస్తూ అనుభవించారు. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ప్రభుత్వం లెక్కలు మార్చింది. వార్షిక కిరాయి 409 రూపాయలు నుంచి ఇప్పుడు 4 కోట్లు అయింది. ఈ మేరకు ప్రభుత్వం నోటీసులు సైతం జారీచేసింది. బాకీపడ్డ 48 కోట్లు తక్షణం చెల్లంచాలని హుకుం జారీచేసింది.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MCA ఈ క్లబ్ వ్యవహారాలపై సీరియస్ అయ్యింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ద్వారా క్లబ్ మేనేజ్‌మెంట్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించింది. అసలు ప్రభుత్వ ఆరోపణలేంటో డిటెయిల్డ్‌గా చూద్దాం...క్లబ్ మెంబర్‌షిప్‌లు కేవలం వారసత్వంగా, కొద్దిమంది చేతుల్లోనే తిరుగుతున్నాయి. ఇది పబ్లిక్ ల్యాండ్‌ను దుర్వినియోగం చేయడమే అంటోంది. మెంబర్‌షిప్ ఫీజుల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నా, నిబంధనల ప్రకారం క్లబ్‌ను నడపడం లేదన్నది ప్రభుత్వ వాదన. ప్రభుత్వ భూమిని వాడుకుంటూ, కేవలం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనేది ప్రభుత్వ ఆరోపణ.
కలోనియల్ ఎలైట్స్‌పై యుద్ధమా? పవర్ పాలిటిక్స్ ఆటా? ఇక్కడ రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి....ప్రధాని మోదీ మొదటి నుంచి "గులామీ మానసికత" అంటే బానిసత్వ మనస్తత్వం వీడాలని చెప్తున్నారు. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చడం, బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చడం ఇందులో భాగమే. జింఖానా క్లబ్ అనేది బ్రిటీష్ దొరతనాన్ని, లూటియన్స్ ఢిల్లీ అహంకారాన్ని సూచిస్తుంది. కాబట్టి, ఆ 'ఎలైట్ సంస్కృతి'కి చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది ఒక వర్గం వాదన. మరోవైపు, ఇది కేవలం 'పవర్ పాలిటిక్స్' అని పొలిటికల్ కామెంటేటర్లు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాలు మారినా... బ్యూరోక్రాట్లు, పాత తరం లాయర్లు, రిటైర్డ్ అధికారులు కలిపి ఒక "డీప్ స్టేట్" లా వ్యవహరిస్తూ, తెరవెనుక పవర్ ఎంజాయ్ చేస్తుంటారు. జింఖానా క్లబ్ వీటన్నింటికీ అడ్డా. ఇప్పుడు ఆ పాత వ్యవస్థను బద్దలు కొట్టి, అక్కడ కూడా ప్రభుత్వ పట్టు సాధించడానికే కేంద్రం ఈ వ్యూహం పన్నిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే...ఈ వివాదం ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. క్లబ్ ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ జిమ్ఖానా క్లబ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు బలవంతంగా క్లబ్‌ను స్వాధీనం చేసుకోమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పుడిది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. క్లబ్ వివాదంపై వెటరన్ జర్నలిస్ట్ సంఘ్వి ఎక్స్‌లో సెన్సేషన్ ఆర్టికల్ రాశారు. సోషల్ మీడియాలో ఢిల్లీ జింఖానా ను, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ హెడ్‌క్వార్టర్స్‌లా చూపిస్తున్నారని అన్నారు. అంటే, రాహుల్ గాంధీ అక్కడ హెలికాప్టర్ పార్క్ చేస్తాడన్నట్టు, సోనియా గాంధీ పిజ్జా కౌంటర్ నడుపుతున్నట్టు, ప్రతి రోజు యాంటీ మోదీ కుట్రలు అక్కడే జరుగుతున్నట్టు, ఒకరకమైన మిథ్ క్రియేట్ చేస్తున్నారని సెటైర్ వేశారు. అంతేకాదు, BJP ఇంకా ఎస్టాబ్లీష్మెంట్ పై పోరాడుతోందా? లేదంటే, BJPయే ఇప్పుడు కొత్త ఎస్టాబ్లీష్మెంట్ అయ్యిందా ? అని విర్ సంఘ్వీ రాసిన ఆర్టికల్‌పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.
దీనిపై మరో వెటరన్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంట్రస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇటాలియన్ సోషియాలజిస్ట్ విల్ఫ్రెడో పారెటో చెప్పిన ఎలైట్స్ సర్క్యులేషన్ థియరీని గుర్తుచేశారు. అంటే, సమాజంలో ఎలీట్‌లు ఎప్పుడూ మాయమవ్వరు. ఒక ఎలీట్ పోతే, మరో ఎలీట్ వస్తుంది. బ్రిటిష్ ఎలీట్ వెళ్లింది. తర్వాత కాంగ్రెస్-లుటియన్స్ ఎలీట్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ-లింక్డ్ పవర్ స్ట్రక్చర్ ఏర్పడుతోందని రాజ్‌దీప్ తన అభిప్రాయం వ్యక్తంచేశారు. మరోవైపు చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా దీనిపై ఓ కామెంట్ చేశారు. ఇందిరా గాంధీ కూడా ఈ ప్రాంతంలోనే ఉండేవారని, అప్పుడు ఇలాంటి సెక్యూరిటీ సమస్యలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ కూడా ఇదే అడిగారు. ఒక్క జింఖానానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని క్వశ్చన్ రైజ్ చేశారు.
ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ దీప్తాంగ్షు చౌదరి మాత్రం ఈ మొత్తం చర్చే తప్పుదారి పట్టిందంటున్నారు. ప్రివిలేజ్ అనేదే అసలు సమస్య అయితే, రాజకీయ నాయకుల విలాస జీవితాన్ని ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, మాజీ సివిల్ సర్వెంట్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. వీఐపీ కాన్వాయ్‌లు, మినిస్టర్ బంగ్లాలు, ట్యాక్స్ పేయర్ డబ్బులతో అనుభవించే రాజకీయ భోగాల గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇక పనిలో పనిగా...సబ్సిడీ కబాబ్‌ల కోసం ఎలీట్‌లు ఏడుస్తున్నారని ప్రముఖ లాయర్ సన్యా తల్వార్ సెటైర్ వేశారు. ఇది డెమోక్రసీ సమస్య కాదు. ఓల్డ్ పవర్ సర్కిల్స్ తమ ఇన్ఫ్లూయెన్స్ కోల్పోతామన్న భయం మాత్రమేనని పోస్ట్ పెట్టారు.
జనరల్‌గా బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా ఉండే టీవీ యాంకర్ రాహుల్ శివశంకర్, ఈసారి మాత్రం క్వైట్ ఆపోజిట్‌గా మాట్లాడారు. ఢిల్లీ జిమ్ఖానా నిజంగానే పాత ఎలీట్ ప్రివిలేజ్‌కు ప్రతీక అయితే, ప్రభుత్వం అదే విషయాన్ని నేరుగా ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే, మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా లూటియన్స్ ఎకోసిస్టమ్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్, వంశపారంపర్య రాజకీయాలు, వలసవాద ఉన్నత వర్గాల వ్యవస్థలు ను పొలిటికల్‌గా టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. ప్రధాని బంగ్లా చుట్టూ భద్రతా సమస్యలే కారణం అయితే, మోదీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోకి వెళ్లి దాదాపు పదేళ్లు అయిన తర్వాత.. ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు క్లబ్ మేటర్ ఎమర్జెన్సీ ఇష్యూ అయ్యిందని ప్రశ్నించారు. అశోక్ హోటల్, సమ్రాట్ హోటల్, రేస్ కోర్స్, ఎయిర్ ఫోర్స్ గోల్ఫ్ క్లబ్, ఫ్లయింగ్ క్లబ్... ఇవన్నీ అక్కడే ఉన్నప్పుడు, ఒక్క ఢిల్లీ జిమ్ఖానా మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతోందని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. నిజంగానే పాత ఎలీట్ వ్యవస్థను కూల్చాలనుకుంటే, అదే విషయాన్ని పబ్లిక్‌గా చెప్పండి. చట్టాన్ని అందరికీ ఒకేలా అమలు చేయండని రాహుల్ శివశంకర్ స్పష్టం చేశారు.
ఏది ఏమైనా... ఒకప్పుడు బ్రిటీషర్లు, ఆ తర్వాత దేశాన్ని ఏలిన పెద్దలు మాత్రమే తిరిగిన ఢిల్లీ జింఖానా క్లబ్ కోట గోడలు బద్దలయ్యాయి. 409 రూపాయల లీజ్ లొసుగులు బయటపడ్డాయి. మరి ఈ క్లబ్ భవిష్యత్తు ఏంటి? ఇకపై సామాన్యుడికి సైతం క్లబ్ తలుపులు తెరుచుకుంటాయా..?, ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటర్లు దీని రూపురేఖలు మారుస్తారా? లేక, ఇదంతా చివరికి పొలిటికల్ వార్‌గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Follow Us