సెక్రటేరియట్లో గుడి, మసీద్, చర్చి ప్రారంభం తెలంగాణ సెక్రటేరియట్లో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ గుడి, మసీద్, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సైతో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. By Karthik 25 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణ సచివాలయంలో నూతనంగా నిర్మించిన గుడి, మసీద్, చర్చలను ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలిసి ప్రారంభించారు. ముందుగా అక్కడ నిర్మించిన నల్లపోచమ్మ గుడిని ప్రారంభించిన సీఎం, గవర్నర్.. ఆమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీద్‌ను ప్రారంభించి అక్కడ ముస్లీం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. తర్వాత చర్చిని ప్రారంభించి చర్చి ఓపెనింగ్ అనంతరం ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. కాగా సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ప్రార్థనా మందిరాలు ఉండటం విశేషం. మరోవైపు డాక్టర్ అంబేద్కర్ సచివాలయాన్ని నిర్మించిన తర్వాత తొలిసారి గవర్నర్ సచివాలయానికి రావడంతో స్వయంగా సీఎం కేసీఆర్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం గవర్నర్ కలిసి గుడి, మసీదు, చర్చి ప్రారంభించడమే కాకుండా కేసీఆర్ దగ్గరుండి సచివాలయం నిర్మాణం నుంచి పూర్తైన తీరు వరకు గవర్నర్‌కు వివరించారు. అంతే కాకుండా.. ఇద్దరు కలిసి సచివాలయం మొత్తం కలిసి తిరిగారు. అక్కడ సీఎం ఛాంబర్, మంత్రుల ఛాంబర్లు, గెప్ట్ల ఛాంబర్లు, ఉన్నతాధికారుల ఛాంబర్లని గవర్నర్ పరిశీలించారు. కాగా గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళి సైకి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. గవర్నర్ కావాలనే ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలేదని మంత్రులు గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళిసై రాజ్ భవన్లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గవర్నర్.. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మరోవైపు గవర్నర్ సైతం ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడంలేదని మండిపడ్డారు. ఇప్పుడు గవర్నర్‌తో కలిసిన కేసీఆర్ రేపు ఎలా ఎంటాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి