Alert: మరో 5 రోజులే గడువు భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల మార్పు గడువు ముగుస్తుంది. మరో 5 రోజులు మాత్రమే వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది. By Karthik 25 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల మార్పు గడువు ముగుస్తుంది. మరో 5 రోజులు మాత్రమే వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోని వినియోగదారులు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. కాగా ఆర్‌బీఐ ఈ ఏడాది మే 17న 2000 రూపాయల నోట్ల చలామణి నిలిపివేసినట్లు ప్రకటించింది. దీంతో నాటి నుంచి నేటి వరకు వినియోగదారులు 2000 రూపాయల నోట్లను 94 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. మరో 6 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు అందకపోవడంతో అవి ఎవరి దగ్గర ఉన్నాయో తెలియడంలేదు. పేదల వద్ద ఉంటే అవి ఒక నుంచి మూడు నోట్ల వరకు ఉండే అవకాశం మాత్రమే ఉందని ఆర్బీఐ భావిస్తోంది. ఈ డబ్బు గవర్నమెంట్‌కు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్న సంపన్నుల వద్దే ఉండే అవకాశం ఉందని అర్బీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా పేదల వద్ద ఉన్నా, సంపన్నుల వద్ద ఉన్నా ఈ ఐదురోజుల్లో డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానంగా మారుతాయని 2000 రూపాయల నోట్లు ఉన్న వారు త్వరగా వాటిని మార్చుకోవాలని హెచ్చరించింది. #last-date #2000-notes #september-30 #94-per-cent #6-per-cent మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి