AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ సునీల్ హెచ్చరిక..!

రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గురుడ్ సుమిత్ సునీల్. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకొన్న 361 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేయడంతో పాటు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

New Update
AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ సునీల్ హెచ్చరిక..!

Ongole: రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గురుడ్ సుమిత్ సునీల్. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకొన్న 361 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేయడంతో పాటు ఇద్దరినీ ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు. సెల్ ఫోన్ ఉన్నవారు CEIR పోర్టల్ లాగిన్ అయితే, పోగొట్టుకొన్న ఫోన్ దొరికే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు.

Also Read: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఇలా ఆదేశించారు: దాడి రత్నాకర్

జిల్లాలో గంజాయి కేసులు అధికంగా ఉన్నాయని, ఇటీవల కాలంలో గంజాయి అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేయడం తోపాటు 9 KG ల గంజాయి స్వాదీనం చేసుకున్నామన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే 14500 లేదా  9121102266 నెంబర్ కు కాల్ చేసి తెలుపవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎదైన సైబర్ నేరాల బారిన పడినవారు 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు