/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
Street dogs attack on Child: నగరంలో దారుణం జరిగింది. శంషాబాద్‌లో వీధికుక్కలు దాడి చేయడంతో ఏడాది వయస్సున్న ఓ చిన్నారి మృతిచెందాడు. సామా ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. చిన్నారి గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వీధికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో పసిప్రాణం విలవిల్లాడింది. వీధికుక్కలు చిన్నారులు, పెద్దలపై దాడిచేస్తున్న ఘటనలు ఇటీవల పదేపదే జరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పనితీరుపై నగర వాసులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గతంలోనూ చాలాసార్లు వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. మధురానగర్ కాలనీలో ఇదివరకు ఒకసారి చిన్నారితో పాటు నలుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన ఆ దాడి దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. చాలాసార్లు ఈ సమస్యపై అధికారులకు విన్నవించామని వారు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని హర్షిత కాళ్లపైనుంచి వెళ్లిన లారీ