75 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు..టీచర్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్!

టీచర్లున్న దగ్గర విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులున్న ఉన్న చోట పాఠాలు చెప్పేందుకు టీచర్లు సరిగ్గా లేకపోవడమనే సమస్య ప్రభుత్వ విద్యావ్యవస్థను వెంటాడుతూనే ఉంది. దీనికి నిదర్శనమే కామారెడ్డిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఒక్కటే టీచర్ ఉండడం.

New Update
75 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు..టీచర్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్!

తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏడాది విడుదల చేసే బడ్జెట్ లో వేల కోట్లు విద్యావ్యవస్థ కోసం కేటాయించబడతాయి. దీంతో పాటు సంవత్సరం పొడుగునా.. విద్యావ్యవస్థను మెరుగుపర్చడం కోసం ఎన్నో పథకాలను సర్కార్ ప్రవేశపెడుతోంది. కాని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలం అవుతూనే ఉంది. దీంతో వసతి గృహాల్లో సదుపాయాలు సరిగ్గా లేక విద్యార్థులు నానా అవస్థలు పడడం, సాంబారు, ఉప్మాల్లో పురుగులు ప్రత్యక్షం కావడం.. కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రిపాలు కావడం కామన్ అయిపోయింది.

ఇక టీచర్లున్న దగ్గర విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులున్న ఉన్న చోట పాఠాలు చెప్పేందుకు టీచర్లు సరిగ్గా లేకపోవడమనే సమస్య ప్రభుత్వ విద్యావ్యవస్థను వెంటాడుతూనే ఉంది. దీనికి నిదర్శనమే కామారెడ్డిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఒక్కటే టీచర్ ఉండడం. దీంతో విద్యార్థులు తమకు పాఠాలు చెప్పడానికి టీచర్లను కేటాయించాలని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవాని పేట ప్రాథమిక పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఓకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతి వరకు 75 మంది విద్యార్థులు చదువుతున్నారని.. వారందరికీ ఓకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారని, దీంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువులో రాణించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏంటని వారు కలెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో అవసరానికి మించి టీచర్లు ఉంటుండగా.. మరికొన్ని పాఠశాలల్లో ఇలా అన్ని తరగతులకు కలిపి ఓకే టీచర్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నలుగురు పిల్లలకు ఏడుగురు టీచర్లు ఉన్న ఘటన వెలుగులోకి వచ్చి హల్ చల్ చేసింది. ఇది మరవక ముందే ఇలా 75 మందికి ఓకే టీచర్ ఉండడంతో విద్యార్థులు టీచర్లు కావాలని ఆందోళన చేయడం గమనార్హం. అయితే ఇప్పటికైనా టీచర్ల సమస్య నుంచి ప్రభుత్వ పాఠశాలలను బయట పడేస్తే కాని విద్యార్థులకు భవిష్యత్తు ఉండదని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు