హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధం..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! మెట్రో విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో త్వరలో ప్రారంభిస్తామన్నారు. By P. Sonika Chandra 02 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ‘మన నగరం’(mana nagaram) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్(lb nagar) నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్(minister ktr) మెట్రో(metro) విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్ (double bed rooms)లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు కేటీఆర్(minister ktr). ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(mla devi reddy sudheer reddy) ఘటికుడు అని కేటీఆర్ ప్రశంసించారు. అనుకున్న పనిని చేసి చూపిస్తాడన్నారు. అయితే రెడీ అయిన లక్ష బెడ్ రూమ్ లలో ఎల్బీనగర్ నియోజక వర్గంలో 40 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. గృహలక్ష్మీ(gruha laxmi) పథకం కూడా ప్రారంభమైందన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో సమస్యలను పర్మినెంట్ గా పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్(telangana gove) కృషి చేస్తుందన్నారు. వచ్చే 100 ఏళ్ళకు తగినట్లుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈక్రమంలో మెట్రో విస్తరణ పై కూడా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఓఆర్ఆర్ సమయంలోనే మెట్రోకు స్థలం కేటాయించామన్నారు. కాగా, గత వారం కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ జామ్(traffic jam) నగరవాసులకు చుక్కలు చూపించింది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నెటిజన్లు మంత్రి కేటీఆర్ కు ట్వీట్స్ చేశారు. దానికి బదులిస్తూ.. త్వరలోనే మెట్రో విస్తరణ ఉంటుందన్నారు మంత్రి. అయితే రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కు చెక్ పెట్టడానికి సర్కార్ మెట్రో విస్తరణ పైనే ఫోకస్ పెట్టింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి