AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న కోనసీమ వాసి.. స్వదేశానికి వచ్చేందుకు..

సౌదీ అరేబియాలో చిక్కుకున్న కొనసీమ వాసి వీరేంద్రకుమార్‌ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుని కోనసీమకు రానున్నాడు.

New Update
AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న కోనసీమ వాసి.. స్వదేశానికి వచ్చేందుకు..

AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న వీరేంద్రకుమార్ ను స్వదేశం తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి. సౌదీ నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని కోనసీమకు రానున్నాడు గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్. అంబాజీపేట మండలం ఇసుక పూడి గ్రామానికి చెందిన సారెళ్ళ వీరేంద్ర కుమార్.. ఏజెంట్ ను నమ్మి కతార్ దేశానికి పని కోసం వెళ్లాడు.

అయితే, ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్నాడు. దీంతో ఎడారిలో చావు బతుకుల మధ్య ఉన్నానంటూ తన కష్టాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు కోనసీమ వాసి. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించి  వీరేంద్ర కుమార్ కు ధైర్యం చెప్పి.. తిరిగి స్వదేశానికి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. సౌదీలో ఇండియన్ ఎంబసీతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వీరేంద్ర కుమార్ ను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.

Also Read: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు