Ramoji Rao Movies: ఎన్టీఆర్ ని హీరోని చేసింది.. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ చేసింది రామోజీరావు సినిమాలే! రామోజీరావు మీడియాలోనే కాదు సినిమాల నిర్మాణంలోనూ అద్భుతాలు చేశారు. ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా ఆయనే తీశారు. విజయశాంతిని ప్రతిఘటనతో లేడీ సూపర్ స్టార్ చేశారు. మయూరి, అశ్వని లాంటి బయోపిక్స్.. చిత్రం, నువ్వేకావాలి లాంటి ప్రేమ సినిమాలు రామోజీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. By KVD Varma 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Ramoji Rao Movies: మీడియా చక్రవర్తిగా చెప్పుకునే రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు పేరు చెబితే మీడియానే ముందు గుర్తుకు వస్తుంది. కానీ, ఆయన మంచి అభిరుచి ఉన్న నిర్మాత (Producer) కూడా. మంచి సినిమాలు ఎన్నింటినో ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో మొదలైన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రస్థానంలో ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. విజయశాంతిని (Vijayashanti) లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టిన కర్తవ్యం (Karthavyam) సినిమా ఈ సంస్థ నుంచి వచ్చిందే. సినిమాలు ఎదో తీసాం లే అనే పద్ధతిలో కాకుండా మంచి కథాబలం.. సామాజిక సందేశం ఉన్న సినిమాలను నిర్మించారు రామోజీరావు. అలాగే ఆయన సినిమాల ద్వారా ఎందరో కళాకారులను పరిచయం చేశారు. అసలు ఊరూ పేరూ తెలియని నటులు.. దర్శకులు.. కథకులు రామోజీరావు సినిమాల ద్వారా పరిచయం అయి సినీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించినవారు ఉన్నారు. సాగరికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ మల్లెమొగ్గలు, సితారను పరిచయం చేసిన మనసు మమత రామోజీరావు సినిమాలే. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా మొదటి సినిమాను నిర్మించింది రామోజీరావే. నిన్ను చూడాలని (Ninnu Choodalani) మూవీతో ఎన్టీఆర్ రామోజీ సంస్థలోనే ఆరంగేట్రం చేశారు. అలాగే ఉదయకిరణ్ ను (Uday Kiran) హీరోగా తీసుకువచ్చింది ఉషాకిరణ్ సంస్థే. చిత్రం సినిమాతో ఉదయకిరణ్ తో పాటు తేజను దర్శకుడిగా పరిచయం చేశారు. వీరిద్దరి కెరీర్ ఎంత పీక్స్ లో ఉండేదో అందరికీ తెలిసిందే. రోజారమని కొడుకు.. అప్పటివరకూ బాలనటుడిగా ఉన్న తరుణ్ ను సూపర్ హిట్ సినిమా నువ్వేకావాలితో పరిచయం చేసింది రామోజీరావు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, యమునను 1987లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పైగా పూర్తిస్థాయి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అది. అంతేకాదు.. అది రియల్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా కూడా. Also Read: పచ్చళ్ల నుంచి మీడియా దాకా..రామోజీ విజయ ప్రస్థానం ఇదే Ramoji Rao Movies: ఇంకా బయోపిక్స్ తీయడంలో కూడా రామోజీరావు విధానమే వేరు. నాట్య కళాకారిణి సుధా రామచంద్రన్ జీవిత కథ ఆధారంగా ఆమెనే హీరోయిన్ గా పెట్టి మయూరి వంటి సినిమాని తీసి ప్రేక్షకులకు ఒక హృద్యమైన జీవితాన్ని పరిచయం చేశారు. ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయి.. జైపూర్ కాలుతో శాస్త్రీయ నాట్యంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్న యువతి సుధ. ఆమె జీవిత కథను స్ఫూర్తిదాయకంగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. అశ్వని నాచప్ప పేరు విన్నారుగా. రన్నింగ్ లో ఎన్నో మెడల్స్ సాధించిన క్రీడాకారిణి. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఆమె జీవిత కథనే అశ్వని పేరుతొ తెరకెక్కించారు రామోజీ. కీరవాణి లాంటి సంగీత దర్శకులు.. త్రివిక్రమ్ లాంటి దర్శకులు.. తమ సినీ జీవితం మొదట్లో రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ సినిమాల్లో తమ ప్రతిభను చూపించిన వారే. #ramoji-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి