NTR commemorative coin: ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటరత్న విశ్వవిఖ్యాత దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.100 స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి గుర్తుగా ఈ స్మారక నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.

New Update
NTR commemorative coin: ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

NTR commemorative coin: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటరత్న విశ్వవిఖ్యాత దివంగత నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రూ.100 స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి గుర్తుగా ఈ స్మారక నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా స్మారక నాణేలను విడుదల చేయాలన్న ప్రతిపాదనలు కేంద్ర సాంస్కృతిక శాఖ చేస్తుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే నాణేల ముద్రణ జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో కేంద్ర ఆర్థిక శాఖే ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురేందశ్వరి ఈ నాణెం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అంగీకరిస్తూ మింట్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఈ నాణెం తయారీ మొదలైంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. హైదరాబాద్ మింట్‌లో ఓ వ్యక్తి స్మారకార్థం తయారైన మొట్టమొదటి నాణెం ఇదే. ఇప్పటివరకు ముంబై మింట్ సహా ఇతర ప్రాంతాల్లో దేశంలో పలువురు మహానుభావుల పేరిట స్మారక నాణేలు తయారయ్యాయి. టైగర్ ప్రాజెక్టులో భాగంగా పులి బొమ్మతో స్మారక నాణేన్ని రూపొందించాం కానీ వ్యక్తుల పేరిట మాత్రం ఇదే తొలిసారి అని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. భారతీయ సినీ చరిత్రతో పాటు రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ స్మారక నాణెం తయారుచేసే అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

publive-image

స్మారక నాణెం కాబట్టి కేవలం ఆయన గుర్తుగా దాచుకోడానికి మాత్రమే ఇది ఉపయోగడపడుతుందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలి విడతలో 12,000 నాణేలు తయారు చేశామని.. కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. కావాల్సిన అందరికీ అందేలా ఈ నాణెం తయారుచేస్తామని స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్‌లో సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్‌తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద ఈ నాణెం అమ్మకానికి లభిస్తుందన్నారు. రేపు(ఆగస్టు 29) ఉదయం 10 గంటల నుంచి ఈ నాణేల అమ్మకం మొదలవుతుందని తెలిపారు.

ఇక ఈ నాణెం తయారీలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉపయోగించామన్నారు. ఈ రూ.100 నాణెం అసలు ధర రూ. 3,500 నుంచి రూ.4,850 వరకు ఉంటుందని నాయుడు తెలిపారు. ప్యాకింగ్ మెటీరియల్‌ను బట్టి ధర మారుతుందన్నారు. నాణెం తయారీకి కూడా దాదాపు అంతే ఖర్చవుతుందని.. ఇందులో మింట్‌కి ఎలాంటి లాభం ఉండదని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ నాణెం విడుదల.. ఆయన గురించి ముర్ము ఏం అన్నారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు