Nizamabad: నగల కోసమే జంట హత్యలు.. నిజామాబాద్ డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కలకలం రేపిన జంట హత్య కేసును పోలీసులు సీరియస్‌గా దర్యాప్తుచేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగల కోసమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By BalaMurali Krishna 19 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి బంగారం కోసమే హత్యలు? నిజామాబాద్ జిల్లాలో జరిగిన జంట హత్యల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనా స్థలాన్ని ఇంచార్జ్ సిపి అనీల్ కుమార్ సందర్శించారు. ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నగల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు తెలుస్తోంది. ఆర్మూర్ పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. 20 సంవత్సరాలుగా ఒకేచోట.. అక్కాచెల్లెళ్లు ఇద్దరు గత 20 సంవత్సరాలుగా ఒకేచోట కలిసి ఉంటున్నారు. అయితే అక్క రాజవ్వకు భర్త భరత్ నుంచి 20 సంవత్సరాల క్రితమే విడాకులయ్యాయి. ఆమె చెల్లి గంగవ్వ భర్త సైతం చనిపోయాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ కొడుకు మహిపాల్ తల్లి వద్దనే ఉంటున్నాడు. మరో కొడుకు శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో నివసిస్తున్నాడు. గంగవ్వను మంగళవారం ముధోల్‌లోని కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లిన శ్రీనివాస్ రాత్రి 7:30 గంటలకు ఇంటి వద్ద వదిలి ఊరు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. బండరాయితో కొట్టి.. పెట్రోల్ పోసి.. పట్ణణంలోని జిరాక్స్ నగరం రెండో వార్డుకు చెందిన మగ్గిడి రాజవ్వ (72), గంగవ్వ (62) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇద్దరి తలలపై బండరాయితో కొట్టి కిరాతకంగా చంపేశారు. అనంతరం మృతదేహాలను పెట్రోల్ పోసి తగులబెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. ఇంటి కిటికీ వద్దకు వెళ్లి చూడగా కాలిపోయిన స్థితిలో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి. భయాందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిసరాలను పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి