AP Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఆ సంస్థలో భారీగా ఉద్యోగాలు!

ఏపీ (AP) ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది.

New Update
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

NIT AP Recruitment 2023: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది.

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి...

అసిస్టెంట్‌ ప్రొఫెసర్  గ్రేడ్‌ -2 (Assistant Professor Grade-II)

Also read: ఇంద్రకీలాద్రీ పై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు!

24 ఖాళీలు..

ఈసీఈ (ECE), ఈఈఈ (EEE) , బయో టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ (CSE) , మెకానికల్‌ ఇంజినీరింగ్‌ , హ్యూమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌, సైన్సెస్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించి మొత్తం 24 ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్ట్‌ లకు సంబంధించి ఫస్ట్‌ క్లాస్‌ బ్యాచిలర్‌ డిగ్రీ కానీ, మాస్టర్స్‌ డిగ్రీ కానీ, పీహెచ్‌ డీ ఉత్తీర్ణులు అవ్వడంతో పాటు ఇంతకు ముందు ఎక్కడైనా ప్రొఫెసర్‌ గా పని చేసిన అనుభవం ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, ఈ డబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. బయట దేశాల్లో ఉంటున్న భారతీయులు అయితే రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంతో పాటు పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో అర్హత సాధించి ఉద్యోగం పొందితే నెలకు రూ. 70,900 వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది.

వీటి కోసం అక్టోబర్‌ 16 నుంచి ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ 13 నవంబర్‌.

Official Website

Apply Online

Also Read: 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు