Presvu: కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ కొత్త ఐ డ్రాప్స్‌తో చెక్ పెట్టండి..! కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే ‘ప్రెస్‌వు ఐ డ్రాప్స్’ మార్కెట్‌లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ కొత్త ఐ డ్రాప్స్‌కు DCGI ఆమోదం తెలిపింది. దీని ధర రూ. 350 వరకు ఉంటుంది. By Jyoshna Sappogula 04 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Presbyopia: ఈ మధ్య కాలంలో పెద్ద వాళ్ళు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు సైతం ఐసైట్ కారణంగా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అయితే, కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే సరికొత్త ఐ డ్రాప్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. Also Read: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు సమస్యతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనినే ప్రెస్బియోపియా అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 109 నుంచి 180 కోట్ల మంది ఐసైట్ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా 40 - 45 వయసులో ఉన్నవారికి ఈ సమస్య మొదలవుతుంది. 60 ఏండ్ల వయసు వచ్చే నాటికి ఇంకా తీవ్రమవుతుంది. ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గరిగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించవు. ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి పెట్టుకోవాల్సి వస్తుంది. Also Read: అందుకే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం.. వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు: చంద్రబాబు ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ‘ప్రెస్‌వు ఐ డ్రాప్స్’ను ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ డెవలప్ చేసింది. దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో DCGI తుది అనుమతి ఇచ్చింది. ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ప్రెస్బియోపియా బాధితులకు కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ వివరించింది. దీని ధర రూ. 350 వరకు ఉంటుందని, వచ్చే నెల అక్టోబరు మొదటి వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. #eye-drops మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి