గిఫ్ట్స్‌ కోసం ఇలా కొట్టుకున్నారేంట్రా.. రణరంగంగా న్యూయార్క్

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ రణరంగంగా మారింది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన ప్రకటన ఉద్రిక్తతలకు దారి తీసింది. తన అభిమానులకు ఫ్రీ గిఫ్ట్స్‌ ఇస్తానని అనౌన్స్‌ చేయడం ఘర్షణకు కారణమైంది.

New Update
గిఫ్ట్స్‌ కోసం ఇలా కొట్టుకున్నారేంట్రా.. రణరంగంగా న్యూయార్క్

రెచ్చిపోయిన అభిమానులు..

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ రణరంగంగా మారింది. అభిమానులకు ఫ్రీ గిఫ్ట్స్‌ ఇస్తానని అనౌన్స్‌ చేయడం ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన ప్రకటన ఉద్రిక్తతలకు దారి తీసింది. వేలాదిగా తరలిరావడంతో కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. తమ అభిమాన వ్యక్తిని చూసి, అతనిచ్చే కానుకల కోసం జనం పోటెత్తడంతో అల్లర్లు చెలరేగాయి. అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులకు బహుమతులిస్తానన్న ప్రకటనతో అతను కూడా చిక్కుల్లో పడ్డాడు.

ఉచిత బహుమతులంటూ ప్రటకన..

న్యూయార్క్‌కు చెందిన 21ఏళ్ల కై సెనట్‌ ఓ పాపులర్‌ వీడియో క్రియేటర్‌. అతనికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ట్విచ్ అనే లైవ్‌స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అతడికి 65లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలోనూ అతనికి లక్షల్లో అభిమానులున్నారు. గతేడాది స్ట్రీమ్‌ అవార్డుల్లో స్ట్రీమర్‌ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడంతో అతడికి మరింత పాపులారిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మన్ హటన్ యూనియన్ స్వ్కేర్ పార్క్‌లో.. లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు. ఫ్యాన్స్‌ను డైరెక్ట్‌గా కలుస్తానని, వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు బహుమతులు ఇస్తానని ప్రకటించారు.

పోలీసులు అదుపులో యూట్యూబర్..

ఇంకేముంది సెనట్‌ పోస్ట్‌తో మన్‌హటన్‌ పార్క్‌కు అతడి అభిమానులు పోటెత్తారు. 2వేలకు పైగా మంది యువత సెనట్‌ను చూసేందుకు అక్కడకు వచ్చారు. దీంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే బహుమతుల కోసం కొందరు అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. వారంతా ఒకరినొకరు తోసుకోవడం, బాటిళ్లు విసరడం, వీధుల్లో వాహనాలను అడ్డగించి, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటివి చేశారు. మరికొందరు అయితే అక్కడున్న బిల్డింగ్‌ల పైకెక్కి నినాదాలు చేశారు. అల్లరి మూకలను అదుపుచేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ తలెత్తి తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఉద్రిక్తతలు తీవ్రమవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యూ ట్యూబర్‌ కై సెనట్ పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు