Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

New Update
Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

Flood Relief Funds: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల అతలాకుతం అయ్యాయి. వరద బాధితులకు బాసటగా టాలీవుడ్ నటులు నిలిస్తున్నారు. నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం అందించింది. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. విపత్తు నుంచి మన రాష్ట్రాలు కోలుకోవాలని ఆమె పేర్కొంది. వరద నుంచి ఉపశమనం కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలో అనన్య నోట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనన్య నాగళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. కోట్లకు కోట్లు తీసుకునే హీరోయిన్లు ఇప్పటివరకు విరాళం ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు. ప్రభాస్ రూ. 2 కోట్లు, చిరంజీవి రూ.కోటి, అల్లు అర్జున్ రూ.కోటి, బాలకృష్ణ రూ. కోటి, జూ.ఎన్టీఆర్ రూ. కోటి ప్రకటించగా.. సిద్దూ జొన్నలగడ్డ రూ.30 లక్షలు, విశ్వక్‌ రూ.10 లక్షలు, వైజయంతీ మూవీస్ రూ.25 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరీ రూ.10 లక్షల ప్రకటించారు.

అనన్యకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు..

వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సహకారంగా యువ నటి అనన్య నాగళ్ల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు