Asian Games: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ.. ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. By BalaMurali Krishna 27 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Nepal vs Mongolia in Asian Games: ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా దీపేంద్ర సింగ్(Dipendra Singh Airee), కుశాల్ మాల్లా (Kushal Malla) అయితే వీరవిహారం చేశారు. దీపేంద్ర అయితే 8 సిక్సర్లతో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి నయా వర్డల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ సింగ్ (Yuvraj Singh 12 బంతుల్లో 50) పేరిట ఉండేది. అంతేకాదు ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి యువరాజ్ సరసన నిలిచాడు. ఇక కుశాల్ మల్లా కూడా కేవలం 34 బంతుల్లోనే 8 ఫోర్లు, 12 సిక్సరల్లో సెంచరీ చేసి టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో చేసిన సెంచరీల రికార్డును కుశాల్ చెరిపేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ పౌడేల్ కూడా 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 61 పరుగులు చేశాడు.దీంతో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 314 పరుగుల స్కోర్ చేసింది. ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. గతంలో ఈ రికార్డు 278 పరుగులతో ఆఫ్ఘానిస్తాన్ జట్టుపై ఉండేంది. అలాగే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగానూ నేపాల్ అవతరించింది. మంగోలియాను కేవలం 13.1 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇంతకుముందు టర్కీపై చెక్ రిపబ్లిక్ జట్టు 257 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా నేపాల్ చెరిపేసింది. అంతేకాదు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగానూ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 26 సిక్సులు నమోదయ్యాయి. గతంలో ఈ రికార్డు ఆప్ఘనిస్థాన్(22) పేరు మీద ఉండేది. మరోవైపు పురుషుల క్రికెట్ విభాగంలో భారత జట్టు 27న తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ Also Read: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం #nepal-cricket #world-records #asian-games-2023 #nepal-vs-mongolia #nep-vs-mng #nepal-vs-mongolia-in-asian-games మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి