AP: జీతాల పెంపు సాధ్యం కాదు.. అంగన్వాడీలతో చర్చలు విఫలం

అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీతాలను పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేయడంతో అంగన్వాడీలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

Anhra Pradesh: అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీతాలను పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేయడంతో అంగన్వాడీలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రస్తుతం జీతాలు పెంచే పరిస్థితిలో లేమని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. కాగా, వారు వెంటనే సమ్మె విరమించాలని; వెంటనే  విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే వారి డిమాండ్లలో కొన్నిటిని ప్రభుత్వం నెరవేర్చిందని, ఇంకా వారు సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

మరోవైపు అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిచారు. సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. బుధవారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల ఇంటిని ముట్టడిస్తామని, వచ్చే నెల మూడో తేదీన కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మేం దేశద్రోహులమా? అవార్డులను వెనక్కి ఇస్తున్నా.. మోదీకి వినేశ్‌ఎమోషనల్‌ లెటర్‌!

కొన్ని రోజులుగా వాళ్లు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ అంగన్వాడీలు సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొంటూ ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారికి ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ పెంచుతున్నట్లు ప్రకటించారు. తక్షణమే అది అమల్లోకి వస్తుందని తెలిపారు. వారి డమాండ్లలో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరామని, వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని ఇటీవల వెల్లడించారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రుల కమిటీతో అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చర్చలు జరిపారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచడం సాధ్యం కాదని మంత్రులు తేల్చేశారు. గ్రాట్యుటీ పై కోర్ట్ కు వెళ్ళాలని సూచించారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు