Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈరోజే ఆఖరి రోజు! శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. By Bhavana 23 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. చక్రతాళ్వార్ కీ అర్చకులు మరి కాసేపట్లో పుష్కరిణీలో అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి వాహనం స్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారు స్వర్ణ రథం పై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి రథాన్ని ముందుకు లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని తిలకిస్తే లక్ష్మీ దేవి కరుణతో పాటు సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణా రెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి స్వామి వారు అశ్వ వాహనం పై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం ఉదయం జరిగే చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. Also read: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!: #tirumala #last-day #brahmotsavalu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి