బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ముందుగా అనుమానితుడిగా ఛత్తీస్‌గఢ్‌లోని 31 ఏళ్ల ఆకాశ్ కనోజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 18న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఆకాశ్ కనోజియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు జనవరి 19న రిలీజ్ చేశారు. అయితే పోలీసుల అత్యుత్సాహంపై ఆకాశ్ కనోజియా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సైఫ్ పై దాడి కేసులో తన ప్రమేయం లేనప్పటికీ తన ఫోటోను ఫోటో విస్తృతంగా ప్రచారం చేయడం వలన తన కుటుంబం నలుగురిలోనూ నవ్వులపాలైందని వాపోయాడు.
ఆ బాధ భరించలేనిది
తనకున్న ఉద్యోగం పోయిందని.. పెళ్లి ఫిక్స్ అయితే ఈ సంఘటన తరువాత అమ్మాయి కుటుంబం వారు సంబంధాన్ని కూడా రద్దు చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. బంధువులు, స్నేహితులు తన కుటుంబాన్ని కలవడానికి వెనుకాడుతున్నారని తెలిపాడు. నాకు జరిగింది మరెవరికీ జరగకూడదన్నాడు. ఇటువంటి సంఘటన తర్వాత మీరు పొందే ఆ బాధ భరించలేనిదని వాపోయాడు. తాను తప్పు చేయలేదని.. ఏ నేరం చేయలేదని.. అలాంటప్పుడు తన ఫోటోను ఎందుకు వైరల్ చేస్తున్నారని ప్రశ్నించాడు. తన ఫోటోలను వెంటనే తొలిగించాలని లేకపోతే కోర్టుకు వెళ్తానని ఆకాశ్ కనోజియా చెప్పుకొచ్చాడు. ఈ కేసులో ఒక వీఐపీ లేదా మిలియనీర్ కొడుకు అనుమానితుడిగా ఉంటే పోలీసులు ఇలాగే ప్రవర్తించేవారా అని కూడా అతను ప్రశ్నించాడు. కేవలం తాను ఓ పేదవాడిని కాబట్టే తనకు ఇలా జరిగిందన్నాడు.
తాను ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్-కోల్‌కతా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఆర్‌పిఎఫ్ సిబ్బంది తనను అడ్డగించారని చెప్పారు ఆకాశ్ కనోజియా. తనను ఎందుకు అడ్డుకున్నారని వారిని అడిగితే ముంబయి పోలీసులు చెప్పారని సమాధానం ఇచ్చారన్నాడు. ఆర్పీఎఫ్ తన విధిని నిర్వర్తించింది.. వారితో నేను ఏకీభవిస్తున్నానని.. . ముంబయి నుంచి వచ్చిన పోలీసులు తనని విచారించారని నేను ఆ నేరం చేయలేదని వారికి చెప్పానని ఆకాశ్ వెల్లడించాడు. కనోజియా తండ్రి కైలాష్ పోలీసులను తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని వాపోయాడు. అసలు నిందితుడికి తన కొడుకుకు పోలికలు లేవని తెలిపాడు. పోలీసుల ప్రవర్తన ఆకాష్ భవిష్యత్తును నాశనం చేసిందని.. దీనికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు.
Also Read : Stock Market: లాభాల్లో పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్లు..