BIG BREAKING :  విజయ్ సంచలనం.. తమిళనాడులో TVK సెంచరీ క్రాస్!

ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో స్టా్ర్ హీరో విజయ్ పార్టీ సంచలన దిశగా అడుగులు వేస్తోంది.

New Update
vijay

ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో స్టా్ర్ హీరో విజయ్ పార్టీ సంచలన దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార డీఎంకే (DMK)ను వెనక్కి నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు విజయ్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే సెంచరీ దాటి అగ్రస్థానంలో నిలిచింది. విజయ్ మేనియా కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా, ఓటు బ్యాంకుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత,  మహిళా ఓటర్లు TVK వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. 2024 ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించిన ఏడాదిన్నర కాలంలోనే ప్రభంజానాన్ని సృష్టించే దిశగా వెళ్తున్నారు. 

మరోవైపు విజయ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  పెరంబూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ నుంచే విజయ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక్కడ డీఎంకే అభ్యర్థిపై ఆయన పైచేయి సాధించడం విశేషం. ఇక తిరుచ్చి  ఈస్ట్‌లో కూడా విజయ్ తన ప్రభావాన్ని చూపుతున్నారు. ఇక్కడ కూడా టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Advertisment
తాజా కథనాలు