Tamilisai Soundararajan : తమిళనాడు ఎన్నికలు.. ఏడోసారి ఓటమి అంచున తెలంగాణ మాజీ గవర్నర్‌!

తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.

New Update
Tamilisai Soundararajan

తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు, విజయ్ టీవీకే అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.   టీవీకే అభ్యర్థి వెంకటరామణన్ 29,570 ఓట్లతో దూసుకుపోతున్నారు. డీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మైలాపూర్ ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. చూస్తుంటే ఆమె ఓడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆమె ఓడిపోతే ఇది ఏడోసారి అవుతుంది. 

తమిళిసై ఇప్పటివరకు 6 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ) పోటీ చేశారు.  

2006 (అసెంబ్లీ): రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
2009 (లోక్‌సభ): చెన్నై నార్త్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2011 (అసెంబ్లీ): వేలచ్చేరి నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం చెందారు.
2016 (అసెంబ్లీ): విరుగంబాక్కం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
2019 (లోక్‌సభ): తూత్తుకుడి నుండి కనిమొళి (DMK) పై పోటీ చేసి ఓడిపోయారు.
2024 (లోక్‌సభ): చెన్నై సౌత్ నుండి పోటీ చేసి ఓటమి చెందారు.

2014 నుండి 2019 వరకు ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2019లో ఆమెను తెలంగాణ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. క్రియాశీల రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో 2024 మార్చిలో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగారు.

Advertisment
తాజా కథనాలు