రతన్ టాటా చెప్పిన ఈ 10 కోట్స్ ఒక్కసారి చదివితే.. జీవితంలో తప్పకుండా పైకి వస్తారు దేశంలోని ప్రముఖ పారిశ్రామిక రతన్ టాటా మరణం దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్ని కలచివేస్తోంది. యావత్ దేశం ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, జంతు సంరక్షణ కేంద్రాలకు విరాళాలు అందించారు. స్వయం కృషితో ఎదిగిన రతన్ టాటా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యువతరానికి ఉపయోగపడేలా ఆయన చెప్పిన 10 స్ఫూర్తిదాయకమైన కోట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. By Archana 10 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/10 ''జీవితంలో ముందుకు సాగాలంటే ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ECG లో కూడా స్ట్రెయిట్ లైన్ వస్తే మనం సజీవంగా లేమని అర్థం'' 2/10 ''మనం మనుషులం, కంప్యూటర్లు కాదు.. కాబట్టి జీవితాన్ని ఆస్వాదించండి.. ఎప్పుడూ సీరియస్ గా ఉండొద్దు''. 3/10 ''నేను మళ్లీ జీవించే అవకాశం ఉంటే, నేను బహుశా భిన్నంగా చేసే అనేక విషయాలు ఉన్నాయి. కానీ నేను చేయలేని దాని గురించి వెనక్కి తిరిగి చూసుకోవడం నాకు ఇష్టం లేదు.'' 4/10 ''ప్రజలు మీపై రాళ్లు విసిరితే, మీ రాజభవనాన్ని నిర్మించడానికి ఆ రాళ్లను ఉపయోగించండి.'' 5/10 ''మీరు వేగంగా వెళ్లాలనుకుంటే, ఒంటరిగా వెళ్లండి. కానీ మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే, కలిసి వెళ్లండి.'' 6/10 ''సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నేను నిర్ణయాలు తీసుకుంటాను మరియు వాటిని సరైనదని రుజువు చేస్తాను.'' 7/10 ''ఇతరులను అనుకరించే వ్యక్తి కొద్దికాలానికే విజయం సాధించవచ్చు.. కానీ అతను జీవితంలో చాలా ముందుకు సాగలేడు.'' 8/10 ''ఓడిపోతామనే భయం మానేయడమే గెలవడానికి ఏకైక మార్గం.'' 9/10 ''మీ మూలాలను ఎప్పటికీ మరచిపోకండి.. మీరు ఎక్కడ నుండి వచ్చారో గుర్తించుకుని గర్వపడండి.'' 10/10 ''తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే బెస్ట్ లీడర్'' మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి