EY Employee death: 'మేడం కాస్త ఆలోచించి మాట్లాడండి..' నిర్మలపై మండిపడుతున్న నెటిజన్లు! పని ఒత్తిడితో మరణించిన EY సంస్థ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ మృతిపై నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత బలం అవసరమని, ఇది దైవత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు నిర్మల. By Archana 24 Sep 2024 in నేషనల్ Short News New Update Nirmala Sitharaman షేర్ చేయండి EY Employee death: ఇటీవలే EY కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న 26ఏళ్ళ యువతి అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే పని ఒత్తిడి కారణంగా మరణించింది. దీంతో ఆమె తల్లి అనితా అగస్టిన్ కంపెనీ పని సంస్కృతిని ఖండిస్తూ యాజమాన్యానికి లేఖ రాయడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగి మృతిపై నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు అయితే తాజాగా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నా సెబాస్టియన్ మృతిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ఇంటి నుంచే పిల్లలకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలని.. దేవుని పై ఆధారపడడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత శక్తి కూడా అవసరమని అన్నారు. భగవంతుడిని నమ్మండి.. ఆయన అనుగ్రహం మనకు కావాలి. దేవుడిని వెతకండి.. మంచి శిక్షణ నేర్చుకోండి. అప్పుడే మీ ఆత్మ శక్తి పెరుగుతుందని చెప్పారు. విద్యాసంస్థలు దైవత్వం, ఆధ్యాత్మికతను తీసుకురావాలి.. అప్పుడే పిల్లలకు అంతర్గత బలం వస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో ఉద్యోగి మృతి పట్ల మంత్రి నిర్మల చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదని నెటిజన్లతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం ఈ వ్యాఖ్యలపై శివసేన పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆ అమ్మాయికి ఎంత అంతర్గత బలం ఉందో చార్టర్డ్ అకౌంటెన్సీ డిగ్రీని చదవడంలోనే తెలుస్తోంది. కానీ విషపూరితమైన పని సంస్కృతి, అధిక పని గంటలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం తప్పక ఉంది. బాధితురాలిని అవమానించడం ఆపేయండి. కొంచెం సున్నితంగా ఉండడానికి ప్రయత్నించండి.. మీరు కోరుకుంటే భగవంతుడు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.'' Dear Nirmala Sitaraman ji,Anna had inner strength to handle the stress that came with pursuing a gruelling Chartered Accountancy degree. It was the toxic work culture, long work hours that took away her life which needs to be addressed. Stop victim shaming and atleast try to be… pic.twitter.com/HP9vMrX3qR — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 23, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి