Aghori: అమ్మాయిలను ముక్కలుగా నరికి.. రక్తం తాగి, వండుకోని తిని..!

తెలంగాణలో ఓ మహిళ తాను అఘోరిని అని.. మనిషి మాంసాన్ని తింటానని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మనిషి మాసం ఎవరైనా తింటారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో మనుషుల మాసం తిన్న షాకింగ్ ఘటనలు.. వారికి పడ్డ శిక్షలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update

19 మందిని అత్యంత క్రూరంగా చంపాడు.. అందులో అంతా మహిళలు, చిన్నపిల్లలే.. అంతటితో ఆగలేదు. వారి శరీరాలను కట్ చేసి.. అందులో నుంచి లివర్‌ తీసుకోని తిన్నాడు. నరమాంస భక్షకులు దేశంలో ఉన్నారా అంటే ఎందుకు లేరు.. అందుకు సంబంధించిన అనేక ఘటనలు గతంలో జరిగాయి. ఇప్పుడు మేం మీకు చెప్పిన కేసు కూడా గతంలో జరిగిందే. 2005-06 మధ్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిఠారీ హత్యలు నరమాంస భక్షకులపై తెలుసుకునేందుకు అతి పెద్ద కేస్‌స్టడిగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ కేసు ఎందుకు గుర్తొచ్చిందని అనుకుంటున్నారా? ఓ రీజన్‌ ఉంది. ఇటివలి ముత్యాలమ్మ టెంపుల్‌కి ఓ లేడీ అఘోరీ రావడం.. ఆమె వరుస పెట్టి టీవీ ఛానెల్స్‌కు ఇంటర్యూలు ఇస్తుండడం.. అందులో మనిషి మాంసం గురించి ప్రస్థావిస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో ఇండియాలో అసలు నరమాంస భక్షకం చట్టబద్ధమైనదా కాదానన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

యూపీలో వరుస హత్యలు..

UP Murder news

Also Read: రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే?

2005-06 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని నిఠారి గ్రామంలో వరుస పెట్టి దారుణ హత్యలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురీందర్ కోలీపై భయాంకర ఆరోపణలున్నాయి. పలువురు యువతులు, మహిళలను అపహరించి, అత్యాచారం చేసి వారిని హత్య చేసినట్లు అభియోగాలున్నాయి. ఆ తర్వాత నరమాంస భక్షక ఆరోపణలు వచ్చాయి. మనుషుల మొండెంతో పాటు ఇతర భాగాలతో కూడిన అనేక పాలిథిన్ సంచులను నాడు పోలీసులు నిందితులు వద్ద గుర్తించడం సంచలనం రేపింది.

కేరళలో ఇద్దరు మహిళలను చంపి..

Kerala Murder
2022లో కేరళలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక జంట ఇద్దరు మహిళలను బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో చంపి, వారి శరీర భాగాలను తినేశారని ఆరోపణలు వచ్చాయి. త్వరగా ధనవంతులు అవ్వాలని ఆ జంట ఈ నరబలికి పూనుకుంది. బాధితురాలు రోజిలిన్, పద్మను గోడకు కట్టేసి వారి చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి చంపేశారు. ఆ ఇద్దరి మహిళల రొమ్ములు కోసి రక్తం బయటకు వెళ్లేలా చేశారు. అందులో ఒక మృతదేహాన్ని 56 ముక్కలుగా నరికివేశారు. 

Also Read: Hyderabad: 90 రోజుల స్పెషల్‌ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్‌

కొల్హాపూర్ లో తల్లినే చంపి..

yellamma
2017లో తన తల్లిని చంపి, కొన్ని శరీర భాగాలను తిన్నాడని ఆరోపించిన వ్యక్తికి కొల్హాపూర్ కోర్టు విధించిన మరణశిక్షను 2024 అక్టోబర్‌ 1న బాంబే హైకోర్టు సమర్థించింది. 2017 ఆగస్టు 28న కొల్హాపూర్‌లో నివాసముండే సునీల్‌ తన 63 ఏళ్ల తల్లి యల్లమను హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని కోసి, కొన్ని అవయవాలను బాండిలో వేయించుకోని తిన్నాడు. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే.. అతను జైల్లో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం కామెంట్స్‌ చేసి మరణశిక్షను ఫిక్స్‌ చేసింది.

Also Read: అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

ఫ్రెండ్ నే చంపి..

2013లో బెంగళూరులో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారంది. ఈ కేసులో మోహన్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడు రవిని కత్తితో చంపి, అతని శరీరంలోని భాగాలను తిన్నాడన్న ఆరోపణలున్నాయి. రవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అందులోని కొన్ని భాగాలను కుక్‌ చేసుకోని తిన్నాడట. మొహన్‌ ఇదంతా డ్రగ్స్‌ మత్తులోనే చేశాడని పోలీసులు చెప్పారు.

Aghora updates

మరోవైపు అఘోరాలు నిజంగానే మనిషి మాంసాన్ని తింటారని వారికి వారుగా అంగీకరించిన సందర్భాలున్నాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత వాటిని కాల్చి కొద్దీగా ప్రసాదంలా తింటామని కొంతమంది అఘోరాలు చెబుతుంటారు. అయితే మనిషి మాంసాన్ని ఏ రూపంలోనైనా తినడాన్ని పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయి. అది చట్టరిత్యా నేరమే!

Also Read: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు