BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7ఏళ్ల జైలు శిక్ష!

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. బేలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సతీశ్‌ కృష్ణ శైల్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.9.60 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పు ప్రకటించింది.

New Update
Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల

Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక స్కాములు జరుగుతున్నాయి.. బీజేపీ, JDS పార్టీలు విమర్శల దాడికి దిగుతున్న క్రమంలో తాజాగా తమ పార్టిం ఎమ్మెల్యే స్కాముల్లో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీకి ఇరుకున పడేసింది. ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు శిక్ష పడింది. బేలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించారని కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ శైల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజాప్రతినిధుల కోర్టులో 2010 లో పిటిషన్ దాఖలు అయింది. కాగా దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఆయనను దోషిగా గుర్తిస్తూ..  ఏడేళ్ల జైలు శిక్ష, రూ.9.60 కోట్ల జరిమానాను విధించింది. 

ఎమ్మెల్యే పదవి ఫాట్...

తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ శైల్‌ ఎమ్మెల్యే పదవి కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సతీష్  పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్నారు. అధికారుల జప్తులో ఉన్న 11,312 టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలపై 2010లో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పలుమార్లు వాయిదా పడుకుంటూ వస్తున్న విచారణ ఎట్టకేలకు నిన్న తెర వేసింది కర్ణాటక ప్రజాప్రతినిధుల కోర్టు. అయితే.. కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యే తరఫున లాయర్లు స్పందించారు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని అన్నారు.

చిక్కుల్లో సీఎం!

కర్ణాటకలో ప్రస్తుతం ముడా స్కామ్‌ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అంశం వివాదస్పదమవుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది సామాజిక సామరస్యానికి ఆటంకం కలిగిస్తుందని ఆరోపిస్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు