Godhra : 100% ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ మహిళ ఘనవిజయం!

గుజరాత్‌లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది.

New Update
godra

గుజరాత్‌లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది. గోధ్రా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 7 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అపేక్షా బెన్ సోనీ అనే హిందూ మహిళ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ వార్డులో ఉన్న ఓటర్లందరూ (100 శాతం) ముస్లింలే!

అపేక్షా బెన్ సోనీకి ఆ వార్డులో ఓటు హక్కు కూడా లేదు. అయినప్పటికీ, ఆమెపై నమ్మకంతో అక్కడి ముస్లిం సోదరులు కుల మతాల పట్టింపులను పక్కన పెట్టారు. కేవలం మతం చూసి ఓటు వేసే పాత పద్ధతులకు స్వస్తి పలికి, తమ వార్డును అభివృద్ధి చేసే సమర్థురాలన్న ఉద్దేశంతో ఆమెను ఎన్నుకున్నారు. ఈ గెలుపును ఇప్పుడు అంతా 'గోధ్రా మోడల్' అని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా మతపరమైన విభజనల గురించి చర్చ జరుగుతున్న వేళ, గోధ్రా ప్రజలు చూపించిన ఈ ఐక్యత ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

బీజేపీ క్లీన్ స్వీప్

ఒకవైపు గోధ్రాలో ఈ ఆసక్తికర ఫలితం వస్తే, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో 192 సీట్లకు గానూ బీజేపీ 146 సీట్లు సాధించగా, కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. సూరత్‌లో బీజేపీ 115 సీట్లు గెలవగా, గతంలో గట్టి పోటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 4 సీట్లకే పరిమితమైంది.

రాజ్ కోట్, వడోదర నగరాల్లోనూ బీజేపీ చెరో 65 సీట్లు సాధించి ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది. మొత్తానికి, గుజరాత్ పట్టణ ఓటర్లు బీజేపీకి జై కొట్టగా.. గోధ్రాలోని వార్డు నంబర్ 7 ఓటర్లు మాత్రం ఒక హిందూ మహిళను గెలిపించి తమ ఉదారతను చాటుకున్నారు.

Advertisment
తాజా కథనాలు