హర్యానా కౌంటింగ్ పూర్తి.. ఫైనల్ లెక్కలివే!

సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన హర్యానా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. బీజేపీ-48, కాంగ్రెస్-37 సీట్లలో విజయం సాధించాయి. దీంతో బీజేపీ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమైంది.

author-image
By Nikhil
New Update

హర్యానా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు గానూ.. అధికార బీజేపీ 48 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ మూడో సారి అధికారంలోకి రానుంది. పవర్ లోకి రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన కాంగ్రెస్ పార్టీ కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ఇండియన్ నేషనల్ లోక్ దల్ (INLD)-2, ఇండిపెండెంట్లు మరో 3 స్థానాల్లో విజయం సాధించారు. 

తేడా ఒక్క శాతమే..

మూడో సారి అధికారంలోకి రాబోతున్న బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో మరో ఒక్క శాతం ఓట్లు అటుఇటైతే ఫలితాలు వేరేలా ఉండేవన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. పెద్దగా ప్రభావం చూపదని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 1.79 శాతం ఓట్లు దక్కాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు