Yanam: యానాంలో గ్యాస్‌ లీక్

యానాంలో గ్యాస్‌ లీక్ కలకలం రేపింది. దరియాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్‌ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు, మత్స్యకారులు భయబ్రాంతులకు గురయ్యారు.

New Update
yanam gas leak

Yanam Gas Leak:యానాంలో గ్యాస్‌ లీక్ కలకలం రేపింది. దరియాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్‌ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు, మత్స్యకారులు భయబ్రాంతులకు గురయ్యారు. నిన్నటి నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా చమురు సంస్థలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలిని యానాం కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. గ్యాస్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంలో గోదావరి జిల్లా?

గోదావరిలో పైపులైను నుండి గ్యాస్ లీక్ అవ్వడం స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకు అయింది. గ్యాస్ లీక్ అవ్వడంతో గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు  గ్యాస్ లీక్ అవ్వడం చూసి భయబ్రాంతులకు లోనయ్యారు.

ఎంతకు గ్యాస్ లీక్ అవ్వడం ఆగకపోవడం, గ్యాస్ వాసన విపరీతంగా పెరగడంతో మంటలు చెలరేగే అవకాశం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు కంపెనీ ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మత్సకారులు డిమాండ్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే గతంలో కూడా గోదావరి జిల్లాల్లో ఓఎన్‌జీసీ పైపు లైన్ల నుంచి గ్యాస్‌ లీక్‌లు జరిగాయి. కొన్ని సార్లు గ్యాస్ లీక్ అవ్వడం వలన మంటలు చేరి భారీ ప్రాణ, ఆస్తి జరిగిన సంఘటనలు ఉన్నా

Advertisment
Advertisment
తాజా కథనాలు