Fake Mobile Accessories: ఫేక్ వన్ ప్లస్.. ఒప్పో.. రియల్ మీ.. మీ స్మార్ట్ ఫోన్లు ఒరిజినలేనా?

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ OPPO, OnePlus, Realme నకిలీ ఉత్పత్తుల తయారీ గుట్టును బయటపెట్టి గోడౌన్లు, ఫ్యాక్టరీ సీజ్ చేసింది. ఇద్దరు అరెస్ట్ కాగా, భారీగా ఫేక్ మొబైల్ యాక్సెసరీస్ స్వాధీనం చేశారు. వినియోగదారులు జాగ్రత్తగా కొనాలని సూచించారు.

New Update
Fake Mobile Accessories

Fake Mobile Accessories

Fake Mobile Accessories: ఢిల్లీ(Delhi)లో నకిలీ మొబైల్ ఉత్పత్తులపై పెద్ద స్థాయిలో దాడులు జరిగాయి. OPPO, OnePlus, Realme బ్రాండ్ల పేరుతో నడుస్తున్న నకిలీ వస్తువుల తయారీ గుట్టును పోలీసులు బయటపెట్టారు.

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఏజీఎస్ యూనిట్ ఈ దాడులు నిర్వహించింది. కరొల్ బాగ్ ప్రాంతంలోని రెఘర్‌పురాలో ఉన్న రెండు గోడౌన్లలో నకిలీ మొబైల్ యాక్సెసరీస్ ప్యాకింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే మోతీ నగర్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఈ బ్రాండ్ల పేరుతో బాక్సులు తయారు చేస్తున్నారని తేలింది. మొత్తం మూడు చోట్ల దాడులు చేసి ఆ ప్రాంతాలను సీజ్ చేశారు.

దాడుల సమయంలో 8 యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి నకిలీ లేబుల్స్, బాక్సులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వేల సంఖ్యలో ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్స్, అడాప్టర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు చైనాలో నుంచి తక్కువ ధరకు అనబ్రాండెడ్ మొబైల్ యాక్సెసరీస్ తెచ్చి, వాటిని ఇక్కడ బ్రాండెడ్ ఉత్పత్తులుగా ప్యాక్ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో బ్రాండ్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొని, స్వాధీనం చేసుకున్న వస్తువులు నకిలీవేనని ధృవీకరించారు.

ఇలాంటి నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధర చాలా తక్కువగా ఉంటే అనుమానం కలగాలి. ఎప్పుడూ అధికారిక షోరూమ్స్ లేదా నమ్మదగిన స్టోర్లలోనే కొనాలి. అలాగే ప్యాకేజింగ్‌ను కూడా గమనించాలి. అసలు ఉత్పత్తుల్లో ప్రింటింగ్ స్పష్టంగా, లోగోలు కచ్చితంగా ఉంటాయి. నకిలీలలో అక్షర దోషాలు లేదా నాణ్యత తక్కువగా ఉంటుంది.

అదే విధంగా IMEI నంబర్, సీరియల్ నంబర్ లేదా QR కోడ్ ద్వారా బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసి ఒరిజినలా కదా అని నిర్ధారించుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు