BIG BREAKING: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Maharastra Elections: దేశంలో మరో ఎన్నికకు సైరెన్ మోగనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈరోజు దీనిపై మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలిపింది. కాగా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.కాగా మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుండగా.. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5తో ముగుస్తున్న క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆ రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇటీవల రెండు రాష్ట్రాలకు ఎన్నికలు అయిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వర్షాల నేపథ్యంలో దర్శనాలు రద్దు

ఇది కూడా చదవండి: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త!

మహా యుధం @288 స్థానాలు

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ( బీజేపీ, శివసేన, NCP), ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్‌, NCP-SP, UBT శివసేన) మధ్య పోరు హోరాహోరీ జరగనుంది. మరోవైపు జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్‌లో అధికార ఇండియా కూటమి (JMM, కాంగ్రెస్‌), ప్రతిపక్ష NDA కూటమి (BJP, AJSU, JDU) మధ్య పోటీ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వయనాడ్‌ సీటుకు ఎన్నిక జరగనుంది. మేథి నుంచి విజయ సాధించడంతో వయనాడ్‌కు రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్‌ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్!

ఓట్ల యుద్దానికి సిద్ధం...

ఇటీవల హర్యానాఎం జమ్మూ కాశ్మిర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా సర్వేలకే షాక్ ఇచ్చి హర్యానాలో కమలం వికసించింది. హర్యానా పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని వచ్చిన సర్వేలు మోదీ హావలో కొట్టుకుపోయాయి. కాంగ్రెస్ కు మాత్రం హర్యానా ఎన్నికలు పీడ కలలాగా మిగిలిపోయాయి. మరోవైపు బీజేపీకి జమ్మూ కాశ్మిర్ ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వగా.. కాంగ్రెస్ కూటమికి ఊపు పెంచింది. కాగా ఇప్పుడు రెండు పార్టీలు.. రెండు రాష్ట్రాల ఎన్నికకు సిద్ధమయ్యాయి. ఈరోజు ఈ ఎన్నిక వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ సమావేశం కానుంది. అలాగే ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు వ్యూహాలు రచించనున్నాయి.

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగులు

Advertisment
Advertisment
తాజా కథనాలు