కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే?

ఢిల్లీలోని నెబ్​ సరాయ్​ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి దండ్రులు ఆస్తి మొత్తం అక్కకు రాసిస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులను, సొంత అక్కను కత్తితో పొడిచి చంపాడు కొడుకు. దర్యాప్తులో ఈ విషయం కనిపిట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update

Delhi Incident:   విచక్షణ మరిచి కన్న తల్లి తండ్రులనే చంపేశాడు ఓ దుర్మార్గుడు.  తోబుట్టుని కూడా కసితో కడ తేర్చాడు. ఈ  దారుణ ఘటన ఢిల్లీలోని  నెబ్​ సరాయ్​ ప్రాంతంలో జరిగింది. అయితే బుధవారం ఢిల్లీలోని నెబ్​ సరాయ్​లో ఓ ఇంట్లో  కొడుకు మార్నింగ్ వాక్ కి వెళ్లి వచ్చేసరికి.. తల్లిదండ్రులతో పాటు కూతురు దారుణ హత్యకు గురయ్యారు. కొడుకు తప్పా ఇంట్లో అందరూ హత్య చేయబడ్డారు.

హంతకుడు కొడుకే

తాజాగా ఈ మర్డర్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అసలు హంతకుడు కొడుకేనని తెలిసింది. కొడుకు పై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.  తనకు సపోర్ట్ చేయడంలేదనే  కోపంతో  తల్లిదండ్రులను, సొంత అక్కను కత్తితో పొడిచి  చంపినట్లు అతడే స్వయంగా పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

Also Read : 'పుష్ప 2' సినిమాలో 'గంగమ్మ తల్లి' జాతర స్టోరీ ఏంటో తెలుసా..?

అసలేం జరిగిందంటే.. 

ఢిల్లీలోని  నెబ్​ సరాయ్​ కి చెందిన రాజేష్ కుమార్, కోమల్ దంపతులకు ఒక కూతురు కవిత, కొడుకు అర్జున్ ఉన్నారు. అయితే డిసెంబర్ 4న తల్లిదండ్రుల పెళ్లి రోజు కావడంతో ముందు రోజు రాత్రి కవిత, అర్జున్ పెళ్లి రోజు వేడుకలను అంతా ఏర్పాట్లు చేశారు. తీరా తెల్లవారుజామున చూసేసరికి తల్లిదండ్రులు రాజేష్, కోమల్, అక్క కవిత ఇంట్లో రక్తపు మడుగులో పడిఉన్నారు.  దీంతో వెంటనే అర్జున్ పోలీసులకు సమాచారం అందించాడు. 

నిద్రలో ఉండగానే పొడిచి పొడిచి.. 

అనంతరం అక్కడికి  చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు అర్జున్ ని పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఆ సమయంలో అర్జున్ మోహంలో టెన్షన్, మాటల్లో తడబాటు గమనించిన పోలీసులు అర్జున్ ని గట్టిగా ఆరా తీశారు. 

దీంతో అర్జున్  అసలు విషయం బయటపెట్టాడు. తల్లిదండ్రులను,  అక్కను తానే మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నాడు. చదువు విషయంలో తండ్రి ఎప్పుడు తిడుతుండడం వల్ల అతనిపై ద్వేషం పెరిగిందని. ఆ సమయంలో అక్క, అమ్మా సపోర్ట్  చేయకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యానని.. అందుకే కోపంతో చంపేశానని చెప్పాడు. ప్లాన్ ప్రకారం వాళ్ళు నిద్రలో ఉండగానే పొడిచి చంపినట్లు నిందితుడు అర్జున్ తెలిపాడు. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు