భారీ ఎన్‌కౌంటర్.. 36మంది మావోలు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 36మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్‌ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Big Breaking: భారీ ఎన్‌ కౌంటర్‌..12 మంది మావోలు మృతి!

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. బుల్లెట్ల శబ్దాలతో దండకారణ్యం దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా అబూజ్‌ మాడ్‌ అటవీ ప్రాంతంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరికొంత మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పారు. మావోయిస్టుల సామగ్రిని పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల మృతిని ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువకరించారు.  అలాగే ఎన్‌కౌంటర్‌లో సైనికులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు.

వీడియో...

నారాయణపూర్, దంతేవాడ సరిహద్దుల్లోని అబుజ్మద్ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సైనికులు సంయుక్తంగా పాల్గొంటున్నారు. ఎన్‌కౌంటర్‌తో పాటు సైనికుల సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. మూలాల నుండి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 36 మంది నక్సలైట్లను సైనికులు హతమార్చారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ సైనికులతో టచ్ లో ఉన్నారని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు