చెన్నై-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు

తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578), గూడ్స్‌ రైలు ఢీకొన్న నేపథ్యంలో విజయవాడ-డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది.

New Update
TRAIN ACCIDENT

Train Accident: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578), గూడ్స్‌ రైలు ఢీకొన్న నేపథ్యంలో విజయవాడ-డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. కడప, తిరుపతి, అరక్కోణం, నెల్లూరు, సూళ్లూరుపేట, విజయవాడ రూట్లలోనూ పలు రైళ్ల రద్దు అయ్యాయి. కాగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు అధికారులు. దూర ప్రాంత ప్రయాణికులకు నీటి సీసాలు, ఆహార పొట్లాలు అందించి  స్థానికులు సహృదయం చాటుకున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకోవడానికి చెన్నై రైల్వేస్టేషన్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు.

నిన్న జరిగిన ప్రమాదం..

నిన్న చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ‌‌‌ఢీకొట్టింది. ఈ ఘటనల మూడు భోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు మైసూరు - దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్‌ప్రెస్‌గా తెలుస్తోంది. పట్టాలపై నిలబడి ఉన్న సరకు రవాణా రైలును అతి వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.  అదృష్టవశాత్తు ప్రాణాపాయం జగరలేదు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు