బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు గత 15 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 62 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా (21), ఇండిగో (21), విస్తారా (20) విమానాలు బాంబు హెచ్చరికలను ఎదుర్కొన్నాయి. By V.J Reddy 29 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bomb Threats: ప్రస్తుతం దేశంలో వరుస బాంబు బెదిరింపు కాల్స్ లేదా మెయిల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. గత 15 రోజులుగా దేశంలోని విమానాలకు వరుస బాంబ్ బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కల్గిస్తున్నాయి. దీని వల్ల విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నట్లు విమాన సంస్థలు పేర్కొన్నాయి. కాగా నిన్న ఒక్కరోజే వివిధ సంస్థల 62 విమానాలకు బాంబ్ బెదిరింపు కావడం హైటెన్షన్ వాతావరాన్ని క్రియేట్ చేసింది. ఇది కూడా చదవండి: నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన 410 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు... వచ్చిన బాంబ్ బెదిరింపులతో ఎయిర్ ఇండియా (21), ఇండిగో (21), విస్తారా (20) విమానాలకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాలను రద్దు చేశారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే పక్షం రోజుల్లో ఇలా 410 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా తమకు బాంబు హెచ్చరికలు వచ్చాయని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ ఇటీవల తిరుపతిలో... తిరుపతిలోని హోటల్స్ కు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ బాంబ్ బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. మూడోరోజు కూడా బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు చెప్పారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన హోటల్స్ లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! మూడు హోటళ్లకు... గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని పలు హోటళ్లకు వరుస బాంబ్ బెదిరింపులు వచ్చాయి. గురువారం లీలామహల్ సెంటర్‌లోని 3 హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపుల రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్ హోటల్‌ను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. బాంబులు లేవని తేల్చడంతో జనాలు ఊపిరి పీలుచుకున్నారు. ఇలా పలు సార్లు ఫేక్ బాంబు ఇలా బెదిరింపులు రావడంతో.. దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా తాజాగా మూడోసారి కూడా బాంబ్ బెదిరింపులు రావడంతో అక్కడి ప్రజలతో పాటు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో 6లక్షల రేషన్ కార్డులు రద్దు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి