BREAKING: ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు! ఢిల్లీలో పేలుడు జరగడం కలకలం రేపింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 20 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు జరగడం కలకలం రేపింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాల దగ్గర ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు పెద్ద ఎత్తున లేవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వాహనాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. అలాగే ఇంటి అద్దాలు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపడుతున్నారు. ఉగ్రవాద కుట్ర ఎమన్నా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు చుట్టూ ఇల్లు ఉండడంతో ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందనే అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ఘటన స్థలానికి ఫారిన్సీక్ బృందం చేరుకుంది. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు रोहिणी के प्रशांत विहार इलाके में CRPF स्कूल के पास धमाका, सुबह 7:47 बजे PCR कॉल पर मिली जानकारी। स्कूल की दीवार और पास खड़ी गाड़ियों के शीशे क्षतिग्रस्त, कोई घायल नहीं। फॉरेंसिक और बम निरोधक दस्ते ने इलाके को घेरा, जांच जारी। #Delhi #Blast pic.twitter.com/dkiVXmBLEY — Ajay Tomar | अजय तोमर (@ajay_tomar1) October 20, 2024 ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! విమానాలకు బెదిరింపు... ఎయిర్ ఇండియా విమానానికి వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లో 15 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 189 ప్రయాణికులతో దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల 100 స్కూళ్లకు బాంబ్... ఇటీవల ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. స్కూల్లో బాంబ్ ఉందంటూ కొన్ని స్కూళ్లకు ఓ ఆగంతకుడు నుంచి మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు పాఠశాలకు సెలవు ప్రకటించాయి. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే.. ఇందులో ఎమన్నా ఉగ్రవాద కుట్ర ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. లేదా స్కూళ్లకు సెలవు కొరకు కొందరు విద్యార్థులు చేసిన పని అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటన జరిగి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా పోలీసులు ఈ కేసు సంబంధించిన నిందితుడిని పట్టుకోలేదు. తాజాగా ఈరోజు ఉదయం CRPF స్కూల్ ఎదుట పేలుడు జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ #UPDATE | Today at 07:47 am, a PCR call was received in which the caller informed that a blast with a high volume took place near CRPF School Sector 14, Rohini. SHO/PV and staff reached the spot, where the school wall was found damaged with a foul smell. The glasses of a nearby… https://t.co/u4EqbD9jKL — ANI (@ANI) October 20, 2024 #WATCH | Delhi: A blast was heard outside CRPF School in Rohini's Prashant Vihar area early in the morning. Police and FSL team present on the spot. https://t.co/Wo4yHQzTRA pic.twitter.com/s1CNENSIY7 — ANI (@ANI) October 20, 2024 అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి