BIG BREAKING: ఇండియాలో తొలి HMPV కేసు

బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. ఇండియాలో ఇదే తొలి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం.

New Update
virus hmpv

virus hmpv Photograph: (virus hmpv)

చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణఅయిందని  రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా తమ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. అయితే  ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు.   ఫ్లూ నమూనాలలో దాదాపు 0.7% HMPVగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం. HMPV లేదా హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వస్తుంది. 

HMPV లక్షణాలు ఇవే 

ఈ హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు.  

ఈ వైరస్‌ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి.  దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ HMPV వైరస్ కొత్తదేమి కాదు.. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్‌ను వైద్యులు గుర్తించారు. కానీ ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్‌లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మళ్లీ కేసులు పెరిగితే లాక్‌డౌన్ రావడం పక్కా అని కొందరు అంటున్నారు. 

Also Read :  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు