మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్‌ షా సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు.

New Update
Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా

Amit Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. కాగా ఇటీవల అమిత్ షా దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

31 మంది మావోయిస్టుల మృతదేహాలు..

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఊర్మిళపై రూ.10లక్షల రివార్డు ప్రకటించారు బస్తర్‌ ఐజీ. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల వివరాలు బస్తర్‌ ఐజీ సుందర్‌ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో 5 రాష్ట్రాల మోస్ట్‌ వాంటెడ్‌ నక్సల్‌ కమాండర్లు మృతి చెందినట్టు చెప్పారు. మృతుల్లో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన కమలేశ్‌ అలియాస్‌ ఆర్కే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నీతి అలియాస్‌ ఊర్మిళ మృతి చెందినట్లు చెప్పారు. నీతి అలియాస్‌ ఊర్మిళపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యం అయినట్లు తెలిపారు. ఎల్‌ఎంజీ, ఎస్‌ఎల్‌ఆర్‌, ఐఎన్‌ఎస్‌వోస్‌, ఏకే-47లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు