ఆధార్ కార్డు చెల్లదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టునతేదీకి ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని.. స్కూల్ రికార్డుల్లో ఉండే తేదీనే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో బాధితుడికి పరిహారం మంజూరు చేసే వ్యవహారంలో విచారణలో ఈ మేరకు వ్యాఖ్యానించింది.

New Update
Aadhaar Card Alert:ఆధార్ కార్డ్ కు సంబంధించి కీలక అప్ డేట్...వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!!

Aadhar Card: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డు పుట్టునతేదీకి అధికారిక ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. స్కూల్ రికార్డుల్లో ఉండే జన్మదిన తేదీనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. రోడ్డు ప్రమాదంలో బాధితుడికి పరిహారం మంజూరు చేసే కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఈ కేసులో ఆధార్ కార్డు ఆధారంగా వయసు నిర్ధారణ చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఆమోదిస్తూ ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

ఇది కూడా చదవండి: దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ!

ఆధార్ కార్డుది చెల్లదు...

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!

రోడ్డు ప్రమాదంలో 2015లో మరణించిన వ్యక్తి బంధువులు దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం కోర్టు నిన్న  విచారణ చేపట్టింది. కాగా ఇదే కేసులో గతంలో మరణించిన వ్యక్తికి నష్ట పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్ మోటార్ యాక్సిడెంట్ ట్రెబ్యునల్ ఆదేశాలు ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు పంజాబ్, హర్యానా హైకోర్టు చేరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు.. పరిహారాన్ని తగ్గించి ఆధార్ కార్డు ఆధారంగా వయస్సును నిర్ధారించి పరిహారం లెక్కించింది.  

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

కాగా బాధితులు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ కార్డులోని వయసును ఆధారంగా చేసుకొని.. తమకు వచ్చే పరిహారాన్ని హైకోర్టు తగ్గిందని వాపోయారు. స్కూల్ రికార్డుల ఆధారంగా తన వయసు 45 ఏళ్లేనని బాధితుడు కోర్టుకు తెలపగా. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం మోటార్ యాక్సిడెంట్ ట్రెబ్యునల్ తీర్పును సమర్థిస్తూ పుట్టిన తేదీని నిర్ధారించేందుకు ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని.. స్కూల్ స్కూల్ రికార్డుల్లో ఉండే జన్మదిన తేదీనే పరిగణలోకి తీసుకోవాలని చెబుతూ తీర్పు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

Advertisment
Advertisment
తాజా కథనాలు