Janasena: రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ నాయకులు..!

నరసాపురం నియోజకవర్గం జనసేనకు తలనొప్పిగా మారింది. బొమ్మిడి నాయకర్‌, కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు వర్గాలుగా చీలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీటు తనకంటే తనకంటూ పార్టీ నాయకులు ఎవరికివారే ప్రచారం చేస్తున్నారు.

New Update
Janasena:  రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ నాయకులు..!

Janasena Kothapalli V/s Subbarayudu Bommidi Nayakar:  ఏపీ(AP) లో ఎన్నికల హాడావిడి మాములుగా లేదు. గెలుపు మాదంటే మాదంటూ ఒకవైపు అధికార పార్టీ వైసీపీ..మరోవైపు ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీ ప్రచారాలు చేపట్టారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా  టీడీపీ, జనసేన(Janasena), బీజేపీ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) అభ్యర్థులను ప్రకటించింది. టికెట్ దక్కిన నేతలు ఫుల్ జోష్ తో ప్రచారం రంగంలోకి దూకారు. టీడీపీ(TDP) మాత్రం రిసెంట్ గానే ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. మరోవైపు జనసేన అధికారంగా కేవలం 5 సీట్లను మాత్రమే ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

Also Read: మండుటెండలో, నడినెత్తిన భానుడు ఉండగా ఓటు వేస్తారా? పోలింగ్‌ బూత్‌కు వస్తారా?

అయితే, ఉమ్మడి కూటమిలో భాగంగా టికెట్ ఆశించిన నేతలు సీటు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు వైసీపీ(YCP) లో, ఇటు టీడీపీ, జనసేన లో టికెట్ దక్కని ఆశావహులు రాజీనామాలు చేశారు. ఆనంతరం నచ్చిన పార్టీకి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా, నరసాపురం నియోజకవర్గం జనసేనకు తలనొప్పిగా మారింది. బొమ్మిడి నాయకర్‌, కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు వర్గాలుగా చీలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీటు తనకంటే తనకంటూ ఆ పార్టీ నాయకులు ఎవరికివారే ప్రచారం చేస్తున్నారు.

Also Read: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి

ఇలా జనసేనలో వర్గ విభేధాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఇబ్బందులు పెడుతున్నాయి. తనకే సీటు ఖరారంటూ బొమ్మిడి నాయకర్‌ ఇప్పటికే ప్రచారం రంగంలో దూకారు. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మరోనేత కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం నరసాపురం టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. పవన్ తనకే టికెట్ హామీ ఇచ్చారని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు టికెట్ జనసేనకు వెళ్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు