ఇదిగో.. ఈ దరిద్రానికే జగన్‌ వద్దు..లోకేష్ సంచలన ట్వీట్.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. గుంతల రోడ్డు వీడియోను పోస్ట్ చేస్తూ..ఇదిగో.. ఈ దరిద్రానికే జగన్‌ వద్దు అంటూ సంచలన ట్వీట్ చేశారు.

New Update
AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం!

Nara Lokesh: ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో మెయిన్ రోడ్డుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు నారా లోకేష్. ఆ వీడియోలో రోడ్డు అంతా బురదగా, గుంతలు గుంతలుగా ఏర్పడింది. జగనే ఎందుకు వద్దంటే ఇదిగో ఈ దరిద్రానికే అని కామెంట్స్ పెట్టారు. "బురద గుంతగా మార్చిన ..జగనే ఎందుకు కావాలి, ఎందుకు రావాలి అంటున్నారు జనం" అని పోస్ట్ చేశారు.

Also Read: తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే.. తేల్చి చెబుతున్న ఎగ్జిట్ పోల్స్..!


కాగా, ఏపీ లోని రోడ్ల దుస్థితిపై ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అధికార పార్టీ వైసీపీ తప్ప..రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అధ్వానంగా ఉన్న రోడ్లను చూపిస్తూ దుమ్మెత్తిపోస్తుంటారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లను బాగు చేయాలని నిరసనలు, ఆందోళనలు చేస్తునే ఉన్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు గా వ్యవహరిస్తోంది. రిసెంట్ గా  తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం..ఏపీ, తెలంగాణ అభివృద్ధిని పోలుస్తూ సింగిల్ రోడ్డు అయితే ఏపీ, డబుల్ రోడ్లు అయితే తెలంగాణ అని హేళన చేశారు. ఇలా ఏపీలోని రోడ్లపై నిత్యం విమర్శలు వస్తున్నే ఉన్నాయి తప్ప..రోడ్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు