Yanamala: జైలులో చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు: యనమల

జాతీయ స్థాయి నేత అయిన చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టినా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంసభ్యులు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణిలతో కలిసి యనమల ములాఖత్ అయ్యారు.

New Update
Yanamala: జైలులో చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు: యనమల

Yanamala: జాతీయ స్థాయి నేత అయిన చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టినా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంసభ్యులు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణిలతో కలిసి యనమల ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల తనను చూడగానే కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారని.. అక్రమ కేసులు పెట్టిన కార్యకర్తలకు ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పినట్లు తెలిపారు.

భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు..

భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి ఇప్పుడు జైలులో ఉండగా.. భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉండే గదిలో సరైన సౌకర్యాలు లేవని.. అయినా కానీ ఆయన రాష్ట్ర భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా గదిలో ఏసీతో ఇతర సౌకర్యాలు కల్పించాలని జైళ్ల శాఖ డీఐజీకి రిక్వెస్ట్ చేశామన్నారు. జైలులో దోమలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. తాము అధికారులను ప్రశ్నించిన తర్వాతే దోమ తెర ఒక్కటి కల్పించారని పేర్కొన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఎంతగానో శ్రమించారన్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..

తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత పాలకులు ధ్వసం చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుచూపుతో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేయకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని యనమల విమర్శించారు. తన అరెస్టుపై స్పందించిన రాష్ట్ర, జాతీయ నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేయాలని కోరారని.. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నామని యనమల వెల్లడించారు.

గణపతి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు..

అంతకుముందు రాజమండ్రిలోని శ్రీ సిద్ది గణపతి స్వామి ఆలయానికి నారా భువనేశ్వరితో పాటు కుటుంబం సభ్యులు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలని వేడుకున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి సంచలన ప్రెస్‌మీట్.. జగన్ టార్గెట్‌గా..

Advertisment
Advertisment
తాజా కథనాలు