America Elections: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట!

New Update
America Elections: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట!

America Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్‌ బాగా పెరిగింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత మూలాలున్న కమలా హారిస్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు.

'నాటునాటు' పాట స్ఫూర్తితో హిందీలో 'నాచో నాచో' గీతాన్ని రూపొందించారు. ఈ పాటను భారత-అమెరికన్ నాయకుడు అజయ్ భుటోరియా ఎన్నికల ప్రచారంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ... 'నాచో నాచో' అనేది కేవలం ఒక పాట మాత్రమే కాదని... ఇదొక ఉద్యమమని అన్నారు.దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ ప్రచార లక్ష్యమని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటు వేయడానికి 4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 6 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు అర్హత కలిగి ఉన్నారని... కమలా హారిస్ కు మద్దతుగా వీరిని కూడగట్టడమే తమ లక్ష్యమని అజయ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే... 248 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారని అన్నారు.

Also Read: కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment