Muralidhar Rao: మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి నిలబడతా..మురళీధర్ రావు!

మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతానని బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు వెల్లడించారు. ఇక టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుకు సంబంధించి ఆయన  కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలను కలుపుకునే విషయంలో ఇబ్బందికరంగా ఉండడంతోనే పార్టీ అధిష్టానం ఆయన్ని పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్నారు...

New Update
Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు

Muralidhar Rao: మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతానని బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు వెల్లడించారు. ఇక టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుకు సంబంధించి ఆయన  కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలను కలుపుకునే విషయంలో ఇబ్బందికరంగా ఉండడంతోనే పార్టీ అధిష్టానం ఆయన్ని పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్నారు.

అయితే బండి మార్పు పార్టీకి డ్యామేజ్ కాదన్నారు. ఎన్నికలకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో కొందరు పెద్ద తలలు వస్తాయి కాబట్టి వారిని కలుపుకుపోవడంపై ఇబ్బందులు వస్తాయని భావించి తప్పించారేమోనని అభిప్రాయపడ్డారు. కాగా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉందన్న ఆయన.. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ కు వ్యత్యాసం ఎక్కువ అన్నారు. కర్ణాటకలో ఉన్నంత గట్టి పోటీ కాంగ్రెస్ ఇవ్వలేకపోవచ్చన్నారు. కర్ణాటకలో లాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హామీలు ఇచ్చినా వారిని ప్రజలు నమ్మరన్నారు.

ఇక తెలంగాణలో కేసీఆర్ ను వెల్ఫేర్ విషయంలో కొట్టలేమన్న ఆయన.. అలా అని ప్రతిసారి వెల్ఫేర్ పేరుతో కూడా వారు గెలవలేరన్నారు. కేసీఆర్ ను కొట్టాలంటే.. ఆయన ఇచ్చిన హామీలు వాటి అమలులో విషయంలో కొట్టాలన్నారు మురళీధర్ రావు. తేడాను ఇష్యు చేసి దెబ్బతీయాలి.. లేదంటే ఆయన్ను ఓడించలేమన్నారు. ఇక కేసీఆర్ ను కొట్టలేం అనేది పిచ్చి ముచ్చట అని..ఎందుకంటే యూత్ తెలంగాణలో చాలా ఎక్కువని.. 65 శాతం మంది వారే ఉన్నారని అన్నారు మురళీ ధర్ రావు.

ఇవ్వాళ నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని.. యూత్ కు అండగా ఉంటే ఈజీగా కేసీఆర్ ను కొట్టొచ్చన్నారు. యూత్ ఒక్కటే గేమ్ చేంజర్లని ఆయన పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ను ఓడించాలని యువత  డిసైడ్ అయితే వారి ఓట్లు ఎవరికి పడితే వాళ్లే మొనగాళ్ళని అన్నారు.

అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందేనని.. అందుకే జైళ్లు కడుతున్నామని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసలు బీఆర్ఎస్ ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు. ఆయన ఫెయిల్ అవుతున్నారు కాబట్టే.. ఎదో ఒకటి చేయాలని జాతీయ పార్టీ అని కబుర్లు చెప్పారని మురళీధర్ రావు విమర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు