WPL 2024 : ఇది కదా క్రికెట్ మజా..ఉత్కంఠపోరులో ఢిల్లీపై ముంబై విజయం..!! డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి పోరులో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి విజయం సాధించింది. By Bhoomi 23 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Women's Premier League 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) రెండో ఎడిషన్ తొలి మ్యాచ్ లోనే క్రికెట్ లవర్స్(Cricket Lovers) కు కావాల్సినంత సరదా లభించింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) పై ముంబై ఇండియన్స్(Mumbai Indians) 4 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ ను ముంబై సరిగ్గా 20 ఓవర్లలోనే పూర్తి చేసింది. చివరి ఓవర్ 12 పరుగులు అవసరం ఉండగా.. కాప్సీ వేసిన ఈ ఓవర్ లో 2 వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠకు దారి తీసింది. అయితే సజన చివరి బంతిని సిక్స్ మలిచి ముంబైని విజయతీరాలకు చేర్చింది. No Cricket fans will scroll without liking this video🔥 5 off 1 needed and S Sajana seals the game with a MAXIMUM very first ball🤯#WPL2024 #TATAWPL #MIvsDC pic.twitter.com/HatyAheK8k — Women's Premier league TATA WPL (@WPL2024) February 23, 2024 ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) 55, యస్తికా భాటియా 57, హాఫ్ సెంచరీలు కొట్టారు. నాట్ స్కివెర్ 19, అమెలియా కెర్ 24 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు అరుంధతి రెడ్డి 2, ఎలీస్ కాప్సీ 2, మరిజన్నె, షికా పాండె చెర్ వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇది కూడా చదవండి : బీపీ ఎక్కువై.. సర్రున కోపం వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!! #wpl-2024 #cricket-lovers #delhi-vs-mumbai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి